ఏం 'మాయ' చేశారో ; కేవలం 2 సీట్లతో కింగ్ మేకర్ గా అవతారం

ఇందులో ఎలాంటి మాయా లేదు.. మంత్రం లేదు.. ఇది జరిగింది వాస్తవం. చేసింది మాయానే అయిన జరిగింది మాత్రం మాయ కాదు.. కన్ఫూజ్ అవుతున్నారు కదూ.. సరే డైకెక్ట్ గా పాయింట్ లో కి వెళ్లాం..

Last Updated : Dec 13, 2018, 02:04 PM IST
ఏం 'మాయ' చేశారో ; కేవలం 2 సీట్లతో కింగ్ మేకర్ గా అవతారం

మాయావతి ఈ పేరు జాతీయ రాజకీయల పట్ల కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరిది. అదేనండి యూపీకి చెందిన బీఎస్పీ అధినేత్రి మాయవతి. సరే ఇంతకీ ఆమె చేసిన మాయ ఏమిటంటే ..కేవలం రెండు సీట్లు సాధించి రాష్ట్రంలో కింగ్ మేకర్ పాత్ర పోషించారు. అదేమన్న చిన్న చితకా రాష్ట్రమా అనుకుంటే పొరపాటే.. అక్షరాల 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఉన్న అతి పెద్ద రాష్ట్రం..మరి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని తక్కువ స్థానాలతో కింగ్ మేకర్ ఎలా అయ్యేరనేగా మీ ప్రశ్న.. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలవడిన విషయం తెలిసిందే. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 116. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు సరిగ్గా రెండు  అడుగుల దూరంలో నిలిచింది.. అంటే 114 సీట్ల వద్ద నిలిచింది. ఇదే సమయంలో అధికార బీజేపీ పార్టీ 109 స్థానాలతో వెనుకబడింది. 

బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ పార్టీకే అధికారం చేపట్టే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో రెండు స్థానాలు సాధించిన బీఎస్సీ ముందు కాంగ్రెస్ పార్టీ హస్తం చాచింది. దీంతో కరుణ చూపిన మాయవతి ..కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు ముందకు వచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో అధికారం చేపట్టే స్థితికి చేరింది. ఇలా మాయవతి రెండే రెండు స్థానాలతో చక్రం తిప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా అవరించిందన్న మాట.
 

Trending News