ఇదేంటి కేసీఆర్ ప్రమాణం చేయాల్సింది ముఖ్యమంత్రి పదవికి కదా.. దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం ఏంటి ఆశ్చర్యపోకండి..ఇప్పుడు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కానీ వ్యూచర్ లో మాత్రం ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారట..డీటైల్ గా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే
ప్రధాని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే...
కేసీఆర్ కు ఫ్యూచర్ లో ప్రధాన మంత్రి యోగం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు, హస్త సాముద్రిక నిపుణులు రమణారావు వ్యాఖ్యానించినట్లు ఓ ప్రముఖ మీడియాలో ప్రచురితమైంది. ఈ కథనం ప్రకారం కేసీఆర్ ది విక్రమాదిత్య జాతక హస్తమని రమణారావు పేర్కొన్నారు. కొన్ని దైవ ప్రక్రియలు చేస్తే కేసీఆర్ భవిష్యత్తులో దేశ ప్రధాని అయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. వాస్తవంగాను కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ -కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ఆవశ్యకతను చెబుతున్నారు. బహుశ జ్యోతిష్య గురువు సూచనలు మేరకు కేసీఆర్ నడుచుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్‌కు హెలికాఫ్టర్ గండం..
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలే కేసీఆర్ కు హెలికాఫ్టర్ ప్రయాణ గండం ఉందని ఆయన మరో బాంబు పేల్చారు. హెలికాఫ్టర్ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ సందర్భంగా కేసీఆర్ కు కొన్ని సూచనలు చేసినట్లు టాక్.
లోకేష్ కంటే కేటీఆర్ భవిష్యత్తు బెటర్
జ్యోతిష్య గురువు రమణారావు ఈ సందర్భంగా నారా చంద్రబాబు, చంద్రశేఖర్ రావుల వారసుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా నారా లోకేష్ కంటే కేటీఆర్ జాతకం బాగుందన్నారు. కేటీఆర్ త్వరలోనే తెలంగాణాలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముందని జ్యోతిష్య గురువు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.