Vitamin Supplements : మన శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పని చేయాలి అంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన పౌష్టిక ఆహారం తీసుకోనప్పుడు మనలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాటి నుంచి తప్పించుకోవడానికి.. ముందుగానే కొన్ని విటమిన్స్ సప్లిమెంట్లు వాడటం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అయితే స్పెషల్ గా ఇలా సప్లిమెంట్లు వాడటం కంటే సరైన ఆహారం తీసుకోవడమే ఎప్పటికైనా మంచిది. కానీ అలా లేని పక్షంలో డాక్టర్లు కొన్ని సప్లిమెంట్లు తీసుకోమని చెబుతారు. అవి ఏంటో తెలుసుకుందాం.
క్యాల్షియం:
పాలల్లోనూ, పెరుగు లోనూ, ఆకుకూరల్లోను పుష్కలంగా దొరికే కాల్షియం మన ఎముకలను దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ రక్తశ్రావం కాకుండా బ్లడ్ క్లాట్ అవ్వడానికి, నరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా కాల్షియం దోహదపడుతుంది. రోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా ఉండి.. మోకాళ్ళ నొప్పులు లాంటివి మన జోలికి రావు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన ఆడవాళ్లు క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం చాలా మంచిది.
విటమిన్ డి:
రోజూ ఉదయం పూట సూర్యకిరణాలు మన మీద పడితే మన శరీరం విటమిన్ డి తయారు చేసుకుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు అది కూడా కుదరడం లేదు. అప్పుడే శరీరంలోని విటమిన్ తగ్గిపోయి ఎముకలు వీక్ అయిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి.. విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. మెదడు పనితనం కూడా మెరుగవడానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది.
ప్రోబయోటిక్:
పెరుగులో పుష్కలంగా ఉండే మంచి బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ అంటారు. ఇది మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. చెడు బ్యాక్టీరియాని మన జీర్ణవ్యవస్థ నుంచి తీసేసి.. తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. బరువు పెరగడం, మానసిక ఇబ్బందులు, నిద్ర పట్టకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో.. ప్రోబయోటిక్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది
మెగ్నీషియం:
మన శరీరంలోని రోగనిరోధక శక్తితో పాటు మెగ్నీషియం.. మన మెదడు పనితనాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మానసిక సమస్యలు రాకుండా ఉండాలంటే.. మెగ్నీషియం ఎక్కువగానే ఉండాలి. అది తక్కువైనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 30 ఏళ్ళు పైపడే వాళ్ళందరూ మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం.
మల్టీ విటమిన్:
సరైన పౌష్టిక ఆహారం తీసుకోనప్పుడు.. శరీరానికి కావాల్సిన విటమిన్లు లభించవు. అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి మల్టీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.
Also Read: Pothina Mahesh: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పెళ్లాలు ప్రచారం చేయరా? ఛీ నా బతుకు చెడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter