Weight loss : బరువుతగ్గాలి అనుకుంటున్నారా.. నిమ్మతొక్కుతో చేసే ఈ డ్రింక్ తాగితే చాలు

Lemon zest for weight loss :  బరువుతగ్గడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొందరు బరువు తగ్గే సమయంలో ఆరోగ్య సమస్యల పాలు అవుతారు. అలా కాకుండా ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి నిమ్మతొక్క, అల్లంతో తయారుచేసిన డ్రింక్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 6, 2024, 06:03 PM IST
Weight loss : బరువుతగ్గాలి అనుకుంటున్నారా.. నిమ్మతొక్కుతో చేసే ఈ డ్రింక్ తాగితే చాలు

Lemon zest benefits: నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా అందులో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణక్రియకు బాగా దోహదపడతాయి. ఇక నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ యొక్క ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ వల్ల రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

అయితే నిమ్మకాయతో పాటే నిమ్మ తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నిమ్మ తొక్కను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. శరీరాన్ని డిటాక్స్ చేయడం దగ్గర నుండి ముఖం పై నల్ల మచ్చలు పోగొట్టడం దాకా నిమ్మ తొక్కతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గించడంలో కూడా నిమ్మ తొక్క ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్కతో చేసే ఒక డ్రింక్ రోజూ తాగితే తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గవచ్చు. 

డైట్ లు, ఎక్సర్సైజ్ లు చేసి బరువు తగ్గక విసిగిపోయిన వారు కూడా ఈ డ్రింక్ తాగి చూడండి. మంచి ఫలితాలని మీరే చూస్తారు.  

ఎలా చేసుకోవాలి?

ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిలో ఒక నిమ్మ తొక్కను వేయండి. కొంచెం అల్లం తురుము కూడా వేసి బాగా కలిపి రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టి ఉంచేయాలి. ఉదయాన్నే ఆ నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కరుగుతుంది. 

నిమ్మ తొక్కలు.. అల్లం బాగా ఎండపెట్టి పొడిలా కూడా చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. రోజు ఉదయాన్నే రోజుకి కాస్త పొడిని నీళ్లలో వేసి మరిగించి తాగిన సరిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వుని చాలా తొందరగా తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా సహాయపడుతుంది.

అల్లం వల్ల ఉపయోగాలు:

అల్లానికి కొలెస్ట్రాల్ని కరిగించే శక్తి ఉంది. ముఖ్యంగా అల్లంలో ఉండే ఫైబర్ క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆ విధంగా త్వరగా బరువు తగ్గిపోవచ్చు. అల్లంలో ఉండే పీచు పదార్థం కడుపుని నిండుగా ఉంచి ఎక్కువ తినకుండా ఉండేలాచేస్తుంది. 

ఎపుడు తాగాలి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. దానివల్ల బరువు తగ్గించడంలో ఈ డ్రింక్ బాగా సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ మొత్తం కూడా బయటకువెళ్లిపోతాయి.

Also Read: CID Case: చంద్రబాబు, లోకేశ్‌కు ఈసీ ఝలక్‌.. ఇద్దరిపై సీఐడీ కేసు నమోదుతో ఏపీలో కలకలం

Also Read: AP New DGP: ఏపీ కొత్త పోలీస్‌ బాస్‌ హరీశ్‌కుమార్‌ గుప్తా.. గంటల్లోనే వేగంగా మారిన పరిణామాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News