మోడీ సర్కార్ కీలక ఆదేశాలు ; రూ.2 వేల నోట్ల ముద్ర నిలిపివేత ? 

రూ.2 వేల నోట్లు దాచుకున్నారా.. అయితే దీన్ని మార్చుకునే తిప్పులు తప్పేలా లేవు.. మోడీ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. రూ.2 వేల నోట్లు ముద్రణ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి... అతి తర్వతలోనే రూ.2 వేల నోట్లు రద్దు చేసి మరింత కఠిన నిర్ణయం ప్రకటించే అవకాశముందనేది కథనాల సారాంశం. 

Last Updated : Jan 3, 2019, 06:49 PM IST
మోడీ సర్కార్ కీలక ఆదేశాలు ; రూ.2 వేల నోట్ల ముద్ర నిలిపివేత ? 

2016లో నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టించిన మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయంపై కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో రూ. 2 వేల నోట్ల ముద్రను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. గత కొంత కాలం నుంచి రూ.2000 బంద్ చేస్తున్నారనే పుకార్లు వస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ఊహాగానాలనకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం రూ.2  వేల నోట్ల రద్దు చేయాలని, ఆర్బీఐ, ముద్రణ కేంద్రానికి మోడీ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

మనీలాండరింగ్ ను అరికట్టేందకేనా ?
ప్రముఖ మీడియా కథనం ప్రకారం రూ.2 వేల నోట్ల వల్ల మనీలాండరింగ్ కేసులు పెరుగుతున్నట్టు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం..ఈ నోట్ల ముద్రణను నిలిపివేయాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకును ఆదేశించినట్టు తెలుస్తోంది. పైగా రెండు వేల నోటు ఇస్తే చిల్లరు దొరకదనే భయం ఇప్పటికే పోలేదు. ఈ క్రమంలో నోటు రద్దు చేయడమే మేలని కేంద్రం యోచినట్లు సమాచారం.

సరిగ్గా రెండేళ్ల తర్వాత..
2016 నవంబరులో చివర్లో ఈ నోట్లను ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చింది. ఆ సమయంలో మోడీ సర్కార్ అనేక రకాల విమర్శలు వచ్చాయి. వాటిన్నింటినీ బేఖాతరు చేస్తూ కొత్త నోట్లు చమాణిలోకి తెచ్చారు. ఈ సంచలన నిర్ణయం తీసుకొని సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇలాంటి ఆలోచన చేయడం గమనార్హం.

నోట్ల రద్దు జరిగితే..
మార్చి 2018 లెక్కల ప్రకారం: మొత్తం ముంద్రించిన నోట్ల విలువ 18.03 ట్రిలియన్లుగా ఉంది..వాటిలో రూ.2 వేల విలువ 6.73 ట్రిలియన్లు అంటే ఉన్న కరెన్సీలో 37 శాతం ఉంది. అలాగే 7.73 ట్రిలియన్లు  రూ.500 నోట్లు .. అంటే ఇవి 43 శాతం  ఉన్నాయి. ఇక మిలిగిన 20 శాతం  ఇతర నోట్లుగా చలామణి అవుతున్నాయి. నోట్ల రద్దు చేస్తే భారీ లోటు ఏర్పడే అవకాశముందని ఆర్ధిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే  ఆర్బీఐ నుంచి గానీ..కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి కానీ నోట్ల ముద్రణ నిలిపివేస్తున్నట్లు ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Trending News