Get Rid of Open pores: ఓపెన్‌ పోర్స్‌ ఎక్కువయ్యాయా? ఇంట్లో తయారు చేసిన ఈ ఫేస్‌ఫ్యాక్‌ సూపర్ రెమిడీ..

Get Rid of Open pores: మీ ముఖంపై ఉన్న ఓపెన్‌ పోర్స్‌ ఎక్కువగా మారాయా? దీనికి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా? అయితే, దీనికి ఓ ఎఫెక్టివ్‌ ఫేస్‌ ప్యాక్‌ ఉంది. దీంతో ఓపెన్‌ పోర్స్‌ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : May 21, 2024, 12:22 PM IST
Get Rid of Open pores: ఓపెన్‌ పోర్స్‌ ఎక్కువయ్యాయా? ఇంట్లో తయారు చేసిన ఈ ఫేస్‌ఫ్యాక్‌ సూపర్ రెమిడీ..

Get Rid of Open pores: మీ ముఖంపై ఉన్న ఓపెన్‌ పోర్స్‌ ఎక్కువగా మారాయా? దీనికి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా? అయితే, దీనికి ఓ ఎఫెక్టివ్‌ ఫేస్‌ ప్యాక్‌ ఉంది. దీంతో ఓపెన్‌ పోర్స్‌ సమస్యకు చెక్ పెట్టొచ్చు. యోగర్ట్‌, తేనె, క్లే తో మీముఖం టైట్‌గా మారిపోతుంది. దీంతో ఓపెన్‌ పోర్స్‌ ఎక్కువగా కనిపించవు. ఈ మాస్క్‌ మీ ముఖానికి పునరుజ్జీవనం అందిస్తుంది. ముఖానికి హాయినిస్తుంఇ. అంతేకాదు ఇంట్లో తయారు చేసుకునే ఈ ఫేస్‌ ప్యాక్‌ రెగ్యూలర్‌గా మీ బ్యూటీ రొటీన్‌లో యాడ్‌ చేసుకోండి. మీ చర్మం మృదువుగా మారిపోతుంది. ఆ ఫేస్ ప్యాక్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

శనగపిండి, పసుపు..
ఒక చెంచా శనగపిండి మన ముఖానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనికి ఒక చిటికెడ్‌ పసుపు, యోగర్ట్‌ వేసి  అందలో మూడు చక్కల ఆలివ్‌ ఆయిల్‌ కూడా వేసి ఓ ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోండి.  దీన్ని ఓ మంచి పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి. ఓ 20 నిమిషాలపాటు రిఫ్రిజిరేట్‌ చేసుకోవాలి.  దీన్ని ముఖం, మెడ భాగానికి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి, నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటే సరి.

లెమన్ జ్యూస్, తేనె..
నిమ్మరసం, తేనె కలిపి దీనికి చక్కెర కలిపి చిక్కని పేస్ట్‌ తయారు చేయాలి. దీన్ని మీ ముఖం అంతటికి అప్లై చేయండి. సర్క్యూలర్‌ మోషన్లో ముఖానికి రుద్దండి. చివరగా ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి.

ముల్తానీ మిట్టి, టమాట జ్యూస్..
ఈ ఫేస్‌ ప్యాక్‌ కూడా ముఖంపై పేరుకున్న ఓపెన్‌ పోర్స్‌ ఎంతో ఎఫెక్టివ్ రెమిడీ. ముల్తానీ మిట్టి, టమాట రసం వేసి కలపాలి. కావాలంటే ఇందులో గంధం కూడా వేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ ముఖం ఓ 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.

ఇదీ చదవండి: సాధారణ టీ బదులుగా లెమన్ టీ తాగండి.. ఈ మిరాకిల్ మార్పులు మీ శరీరంలో చూడండి..

శనగపిండి, పెరుగు..
ఒక టేబుల్ శనగపిండిలో రెండు టీ చెంచాల పెరుగు వేసి ఫేస్ ప్యాక్ తయారు చేయాలి. ఈ రెండిటినీ బాగా మిక్స్ చేయండి ముఖానికి మెడకు అప్లై చేయండి. ఓ 20 నిమిషాల తర్వాత ఫేస్ ప్యాష్ చేయాలి.

ఇదీ చదవండి: వెజ్ కుర్మాని సులభంగా ఇలా చేయండి.. చపాతీ-పూరీకి ఇదే బెస్ట్ కాంబినేషన్!

ఎగ్ ఫేస్‌ప్యాక్..
ఈ ఫేస్ ఫ్యాక్ తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఒక టేబుల్‌ స్పూన్ ముల్తాని మిట్టి, ఎగ్‌ వైట్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ కీరదోస రసం వేసి మంచి పేస్ట్‌ మాదిరి తయారు చేయాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి చేతి వేళ్లతో రుద్దండి. ఆ తర్వాత ఓ 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్‌ చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News