Passport Renewal: మీ పాస్‌పోర్ట్‌ను ఇలా ఆన్లైన్లో సింపుల్‌గా రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Step by Step Process for Passport Renewal: సాధారణంగా ఏ ఇతర దేశాలకు వెళ్లాలన్నా మనకు పాస్‌పోర్ట్‌ ,వీసా తప్పనిసరి. వీసా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి అయితే పాస్పోర్ట్ మీరు ఏ దేశానికి చెందినవారు  అని ఒక ప్రూఫ్.

Written by - Renuka Godugu | Last Updated : May 28, 2024, 05:30 PM IST
Passport Renewal: మీ పాస్‌పోర్ట్‌ను ఇలా ఆన్లైన్లో సింపుల్‌గా రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Step by Step Process for Passport Renewal: సాధారణంగా ఏ ఇతర దేశాలకు వెళ్లాలన్నా మనకు పాస్‌పోర్ట్‌ ,వీసా తప్పనిసరి. వీసా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి అయితే పాస్పోర్ట్ మీరు ఏ దేశానికి చెందినవారు  అని ఒక ప్రూఫ్. చాలామంది సమ్మర్ హాలిడేస్, వర్క్‌పరంగా, చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్తారు. దీనికి పాస్‌పోర్ట్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి. భారతీయులకు అయితే పాస్‌పోర్ట్‌ తీసుకున్నప్పటినుంచి 10 సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.  ఆ తర్వాత మీరు దాని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాస్‌పోర్ట్‌ రెన్యువల్ చేయించుకోవడం తప్పనిసరి. అయితే పాస్‌పోర్ట్‌ ఎక్స్పైరీ 9 నెలలకు ముందుగానే రెన్యువల్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ దానికి మించి మీరు ఆలస్యం చేస్తే ఇతర పనులు ఉంటే మీరు ఇబ్బందులు పడవచ్చు.
 
18 లోపు ఉన్న మైనారిటీ ఉన్నవాళ్లకి పాస్‌పోర్ట్‌ ఐదేళ్లు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మీరు 15 -18 ఏళ్ల వయసు వారు అయితే పాస్‌పోర్ట్‌ వాలిడిటీ చేయించాలనుకుంటే 10 ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లోనే పాస్‌పోర్ట్‌ రెన్యూవల్ చేయించుకోవాలంటే అది ఎలాగో తెలుసుకుందాం. 

  • మీరు మీ పాస్‌పోర్ట్‌ రెన్యువల్ చేసుకోవాలంటే ముందుగా మీరు పాస్‌పోర్ట్‌ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది
  • ఒకవేళ మీరు అందులో రిజిస్టర్ అయి ఉండకపోతే దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మీకు లాగిన్ ఐడి వస్తుంది.
  • అధికారిక వెబ్సైట్లో మీరు లాగిన్ డీటెయిల్స్ ప్రకారం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్‌ /రి ఇష్యూ ఆఫ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో మీకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అది సరి అయినవి ఉండాలి
  • ఆ తర్వాత పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
  • ఏదైనా పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ అంతా సరిచూసుకొని చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసీట్ పై క్లిక్ చేయాలి
  • షెడ్యూల్ డే ప్రకారం మీ దగ్గర్లో ఉన్న పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లోకి వెళ్లి సరైన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లాలి.

ఇదీ చదవండి: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..

ఒకవేళ మీరు పాస్‌పోర్ట్‌ రెన్యువల్ కి అపాయింట్మెంట్ బుక్ చేయాలనుకుంటే...
పాస్‌పోర్ట్‌ అధికారిక వెబ్సైట్ ని క్రెడియన్షియల్స్ తో లాగిన్ చేయాలి
ఆ తర్వాత view saves submitted application లేబల్‌ పై క్లిక్ చేసి Pay and submit application appointment పై క్లిక్ చేయాలి
పేమెంట్ మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ మీ లొకేషన్ క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మీకు కావాల్సిన రోజు అపాయింట్మెంట్ డేట్ ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది .ఆ తర్వాత పే అండ్ బుక్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేయాలి.

ఇదీ చదవండి: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..

పాస్‌పోర్ట్‌ రెనివల్‌కు కావాల్సిన పత్రాలు..
ఒరిజినల్ పాస్పోర్ట్ 
జిరాక్స్ మొదటి రెండు పేజీల జిరాక్స్‌ కాపీ 
ECR/Non ECR ఫోటో కాపీస్
అడ్రస్ ప్రూఫ్ వ్యాలిడిటీ
extension xerox copy attested copy

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News