Top Selling Hybrid EV Cars: దేశంలో అత్యధికంగా అమ్మడుపోతున్న టాప్ 5 ఈవీ, హైబ్రిడ్ కార్లు ఇవే

Top Selling Hybrid EV Cars: దేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ , హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటం దీనికి ప్రధాన కారణం. దాదాపు అన్ని కంపెనీలు ఈవీ కార్లు లాంచ్ చేస్తుండటంతో లభ్యత పెరిగింది. ఈ క్రమంలో దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎలక్ట్రిక్ కార్లు ఏంటో తెలుసుకుందాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2024, 07:53 PM IST
Top Selling Hybrid EV Cars: దేశంలో అత్యధికంగా అమ్మడుపోతున్న టాప్ 5 ఈవీ, హైబ్రిడ్ కార్లు ఇవే

Top Selling Hybrid EV Cars: భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు రెండూ ఉన్నాయి. రానున్న కాలంలో వీటి సంఖ్య మరింత పెరగనుంది. దాదాపు ప్రతి కంపెనీ నుంచి ఈవీ, హైబ్రిడ్ కార్లు లాంచ్ అవుతున్నాయి. వినియోగదారులు కూడా వీటిపై ఆసక్తి చూపిస్తుండటమే ఇందుకు కారణం. 

ఇటీవలి కాలంలో టొయోటా, మారుతి సుజుకి కంపెనీలు ఎలక్ట్రక్, హైబ్రిడ్ కార్లను పెద్దఎత్తున లాంచ్ చేస్తున్నాయి. ఇన్నోవా హైక్రాస్, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్విక్టో, క్వామ్రీ వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ ఏడాది అంటే 2024 మొదటి త్రైమాసికం జనవరి నుంచి మార్చ్ వరకూ దేశంలో మొత్తం 28 వేల 482 యూనిట్ల హైబ్రిడ్ కార్లు విక్రయమయ్యాయి. దేశంలో అత్యధికంగా విక్రయమైన హైబ్రిడ్ కార్లు ఇవీ..

అత్యధికంగా విక్రయమైన టాప్ 5 హైబ్రిడ్ కార్లు

టొయోటా ఇన్నోవా హైక్రాస్ 14,442 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానం
టొయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ 9, 370 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానం
మారుతి సుజుకి గ్రాండ్ విటారా 2,232 యూనిట్లతో మూడో స్థానం
మారుతి సుజుకి ఇన్విక్టో 1210 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానం
టొయోటా క్వామ్రీ 754 యూనిట్లతో ఐదవ స్థానం

అంటే మొదటి 5 స్థానాల్లో టొయోటా కంపెనీ కార్లు మూడున్నాయి. మారుతి సుజుకి కంపెనీవి రెండున్నాయి. టాప్ 5 స్థానాల్లో ఈ రెండు కంపెనీలే ఉండటం విశేషం. ఇక ఎలక్ట్రిక్ కార్ల గురించి పరిశీలిస్తే...టాటా మోటార్స్ కార్లు అగ్రస్థానంలో ఉన్నాయి. మొదటి త్రైమాసికంలో  టాటా కంపెనీకు చెందిన టాటా పంచ్ ఈవీ 8,549 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక టాటా టియాగో ఈవీ 5704 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది. టాటా నెక్సాన్ ఈవీ 4,223 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. ఇక మహీంద్రా కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు నాలుగో స్థానంలో నిలిస్తే ఎంజీ మోటార్స్‌కు చెందిన అతి చిన్న ఈవీ కారు 2300 యూనిట్లతో ఐదవ స్థానంలో ఉంది. 

ఈవీ కార్ల ఉత్పత్తిలో దేశంలో టాటా కంపెనీ ముందంజలో ఉంది. త్వరలో టాటా కర్వ్, హారియర్, సఫారీ కార్లు కూడా ఈవీ వెర్షన్‌తో రానున్నాయి. 

Also read: Mahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News