Mahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటే

Mahindra New Launch: దేశంలోనే కాదు ప్రపంచ మార్కెట్‌లో కూడా ఎస్‌యూవీలకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఎస్‌యూవీలపై దృష్టి సారించాయి. ప్రముఖ దేశీయ కారు కంపెనీ మహీంద్రా తాజాగా Mahindra XUV 700 AX5 Select లాంచ్ చేసింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2024, 07:15 PM IST
Mahindra New Launch: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ 7 సీటర్, ధర ఎంతంటే

Mahindra New Launch: భారతీయ మార్కెట్‌లో మహీంద్రా కంపెనీకు క్రేజ్ ఎక్కువే. మహీంద్రాకు చెందిన కొన్ని వాహనాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా ఉంటుంటాయి. మహీంద్రా కంపెనీ తాజాగా Mahindra XUV 700 AX5 Select లాంచ్ చేసింది. పెట్రోల్-డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లు కలిగిన ఈ ఎస్‌యూవీ 7 సీటర్ ధర 17 లక్షల్నించి ప్రారంభమౌతుంది. 

ప్రస్తుతం మార్కెట్‌లో Mahindra XUV 700 AX5 Select బుకింగ్స్ జరుగుతున్నాయి. త్వరలో డెలివరీ కూడా ప్రారంభమౌతుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న AX3,AX5లకు మధ్య శ్రేణిలో ఈ కారు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్న Mahindra XUV 700 AX5 Select 7 సీటర్ ఆప్షన్‌లో వస్తోంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఇన్‌ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో 10.25 ఇంచెస్ స్క్రీన్, బిల్ట్ ఇన్ అలెక్సా, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 6 స్పీకర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంజన్ పరంగా చూస్తే AX5 S వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ రెండు ఆప్షన్లలో లభించనుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉన్నాయి. ఇందులో 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 185 హెచ్‌పి పవర్ 420 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక పెట్రోల్ ఇంజన్ అయితే 2.0 లీటర్ టర్బోతో 2000 హెచ్‌పి పవర్, 380 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 

Mahindra XUV 700 AX5 Select ధర

Mahindra XUV 700 AX5 Select ధర గురించి పరిశీలిస్తే ఎంటీ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ ధర 16.89 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక ఏటీ వేరియంట్ పెట్రోల్ ఇంజదన్ అయితే 18.49 లక్షల్నించి ప్రారంభం కానుంది. అదే డీజిల్ ఇంజన్ ఎంటీ మోడల్ 17.49 లక్షలు కాగా ఏటీ మోడల్ 19.09 లక్షలుగా ఉంది. గతంలో వచ్చిన ఏఎక్స్ 3 మోడల్ కంటే దాదాపుగా 50 వేలు ఎక్కువగా ఉంది. 

Also read: Income tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News