ప్రేమోన్మాదం: ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న మధులిక !

ప్రేమెన్మాది దాడిలో గాయపడ్డ మధులిక యశోధా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది  

Last Updated : Feb 7, 2019, 11:44 AM IST
ప్రేమోన్మాదం: ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న మధులిక !

హైదరాబాద్: ప్రేమెన్మాది దాడిలో గాయపడ్డ మధులిక పరిస్థితి విషమంగానే ఉంది. యశోధా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచారు.దాడి కారణంగా ఆమె తల, చేతుల మీద 15కు పైగా గాయాలయ్యాయి. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని.. రెండు మూడు రోజులు గడిస్తే కానీ ఆమె పరిస్థితిపై స్పష్టత రాదంటున్నారు వైద్యులు

భర్కత్‌పురలో ఇంటర్ విద్యార్ధిని ముధులికపై భరత్ అనే యువకుడు నిన్న కొబ్బరిబోడాల కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను యాశోద ఆస్ప్రతిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. తాజా వ్యవహారంపై కేసునమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు
 

Trending News