TS TET Results 2024: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..

TS TET Results 2024 Today: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ లేదా టీజీ టెట్ 2024 ఈరోజు జూన్ 12న విడుదల కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌ టెట్‌ ఎగ్జామ్స్ జూన్‌ 2 వరకు నిర్వహించారు.

Written by - Renuka Godugu | Last Updated : Jun 12, 2024, 12:53 PM IST
TS TET Results 2024: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..

TS TET Results 2024 Today: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ లేదా టీజీ టెట్ 2024 ఈరోజు జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌ టెట్‌ ఎగ్జామ్స్ జూన్‌ 2 వరకు నిర్వహించారు. మే 20 నుంచి ప్రాంభమైన టెట్‌ పరీక్షల ఫలితాలు బుధవారం జూన్‌ 12న ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న టెట్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్ అందింది. టెట్‌ అభ్యర్థులు తమ ఫలితాలను ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.

టెట్‌ 2024 పేపర్ -1 పరీక్షకు 86.03% క్యాండిడేట్స్‌ పరీక్షలు రాయగా  పేపర్ -2 కు 82.58% అటెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా ఏడాది టెట్ నోటిఫికేషన్ మార్చ్ 15న విడుదల అయింది. దీనికి 85,996 పేపర్ -1కు  అభ్యర్థులు అప్లై చేసుకోగా అందులో 57,725 మంది అర్హత సాధించారు.. పేపర్ 2 కు 1,50,491 మంది అప్లై చేశారు. ఈ పరీక్షకు 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు.   టెట్ అధికారిక ఫలితాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tstet2024.aptonline.in/tstet ద్వారా నేరుగా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. లేదా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో కూడా టెట్‌ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి..

ఇదీ చదవండి:  సామాన్యులకు షాక్.. పెరిగిన ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు..

టీఎస్‌ టెట్‌ ఫలితాలను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://tstet2024.aptonline.in/tstet ఓపెన్‌ చేయండి.
ఆ హోంపేజీలో TSTET Result 2024 లింక్‌పై క్లిక్‌ చేయండి.
ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే రిజల్ట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. 
అక్కడ మీ సంబంధిత వివరాలను నమోదు చేయండి. హాల్‌ టిక్కెట్‌ నంబర్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన వివరాలు సరిగ్గా ఇవ్వండి.
చివరగా సబ్మిట్‌ బట్టన్పై క్లిక్‌ చేయండి. 
అప్పుడు టీఎస్‌ టెట్‌ రిజల్ట్స్‌ 2024 స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఇప్పుడు ఈ ఫలితాలను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఈ పత్రాన్ని మీ వద్ద భద్రపరుచుకోవాలి.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో కుండపోత.. అత్యధిక వర్షపాతంతో నిండా మునిగిన ఆ ప్రాంతం

ఈ నేపథ్యంలో 2023తో పోలిస్తే అర్హత శాతం కూడా పెరిగింది. టెట్‌ దరఖాస్తు రుసుము తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ససేమిరా ఒప్పుకోలేదు అయితే, టెట్‌ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు డీఎస్సీకి ఉచితంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News