Best Saturn Remedies In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో ఉన్నాడు. అయితే త్వరలోనే ఈ గ్రహం తిరోగమనం కూడా చేయబోతున్నాడు. జూన్ 29న శని వ్యతిరేక దిశలో తిరగబోతున్నాడు. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. శని దేవుడు ఎలాగైతే, వ్యక్తల కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడో, ఈ గ్రహ ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అలాగే శని అప్పుడప్పుడు కర్మ ఫలితాలను బట్టి ఆగ్రహానికి కూడా గురవుతూ ఉంటాడు. దీని కారణంగా జీవితంలో తీవ్ర గందరగోళం కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే ఏలినాటి శని సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని నియమాలు పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ శని తిరోగమన సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషం, మిథునం:
జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఈ రాశులవారిపై శని తిరోగమన ప్రత్యేక ప్రభావం పడబోతోంది. కాబట్టి వీరు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శని ఆగ్రహం నుంచి విముక్తి పొందడానికి నువ్వుల నూనెతో అభిషేకం కూడా చేయాల్సి ఉంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరు శని దేవుడికి ఆవాల నూనెతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కర్కాటకం:
ఈ కర్కాటక రాశి వారు శని అనుగ్రహం పొందడానికి ప్రతి శని వారం ఎవరికైనా దాన,ధర్మ కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది.
సింహ రాశి:
ఈ తిరోగమన సమయంలో సింహ రాశివారు కూడా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశివారు శని దేవుడిని శాంతింపజేయడానికి ఆవనూనె లేదా నువ్వుల నూనెను నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది.
కన్యా రాశి:
ఈ కన్యా రాశివారు కూడా శని దేవుడికి ఆవాల నూనెతో అభిషేకం చేసి దాన కార్యక్రమాలు చేయాలి.
తులారాశి:
ఈ రాశివారు ఆవనూనెను దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి:
శని దేవుడి ఆగ్రహం ఈ రాశివారిపై నుంచి తొలగిపోవడానికి బాదం నూనెను పలువురికి దానం చేయాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మకరరాశి, కుంభ రాశి:
ఈ రెండు రాశులవారు నువ్వుల నూనెతో శనిదేవుడికి నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆలయానికి వెళ్లి ఆవనూనెను కూడా దానం చేయాల్సి ఉంటుంది.
మీన రాశి:
ఈ రాశివారు ప్రతి శనివారం తప్పకుండా బాదం నూనెతో అభిషేకం చేయాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి