Ram Charan: గేమ్ చేంజర్ విషయంలో శంకర్ కొత్త ప్లాన్.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..

Game Changer Release Date: గత కొంతకాలంగా అటు భారతీయుడు 2, ఇటు గేమ్ చేంజర్.. అంటూ శంకర్ రెండు పడవల ప్రయాణం చేశారు. ఆఖరికి భారతీయుడు 2.. సినిమాకి విడుదల తేదీని కూడా ప్రకటించి.. గేమ్ చేంజర్ సినిమా.. గురించి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ చాలా కోపంగా. ఉన్నారు. ఇది చాలదు అన్నట్టు.. శంకర్ చేస్తున్న కొత్త ప్లాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ను.. మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 17, 2024, 04:55 PM IST
Ram Charan: గేమ్ చేంజర్ విషయంలో శంకర్ కొత్త ప్లాన్.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..

Ram Charan Game Changer Update: రాజమౌళి తరువాత స్టార్ డైరెక్టర్.. అనగానే ముందుగా గుర్తొచ్చేది శంకర్ పేరే. అన్ని బ్లాక్ బస్టర్లు.. అందించిన శంకర్ గత కొంతకాలంగా.. చాలా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం శంకర్ చేతిలో.. భారతీయుడు 2, గేమ్ చేంజర్ అని.. రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాలు మీద భారీ.. అంచనాలు ఉన్నాయి. అయితే ఒకవైపు.. భారతీయుడు సినిమా షూటింగ్ మొదలైనప్పుడే.. శంకర్ ఇటు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాలతో రెండు పడవల ప్రయాణం.. చేయాలని అనుకున్నారు శంకర్. వినటానికి బాగానే ఉన్న.. ప్రాక్టికల్ గా మాత్రం ఇది వర్క్ అవుట్ అవ్వలేదు. 

ఒక సినిమా అప్డేట్ ఇస్తే.. మరొక సినిమా అప్డేట్ల కోసం అభిమానులు.. గోల చేసేవారు. దీంతో చాలా వరకు షూటింగ్ షెడ్యూల్స్ ని.. శంకర్ సైలెంట్ గానే పూర్తి చేసేశారు. అంతా బాగానే జరుగుతుంది.. అనుకున్న సమయంలో శంకర్ భారతీయుడు 2 ..సినిమా జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని అధికారికంగా ప్రకటించారు.

రామ్ చరణ్ అభిమానులు మాత్రం గేమ్ చేంజర్ సినిమా సంగతి ఏంటి.. అని శంకర్ ని ట్రోల్ చేశారు. ఒకవైపు ఇప్పటికీ రామ్ చరణ్ అభిమానులు.. శంకర్ మీద చాలా కోపంగా ఉన్నారు. అది తగ్గక ముందే శంకర్ మరొకసారి.. రామ్ చరణ్ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 2 సినిమాని రెండు భాగాలుగా.. విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 

అయితే తాజా సమాచారం ప్రకారం.. శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాని.. కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తే.. బాగుంటుందని అనుకుంటున్నారట. తను రాసుకున్న కథ ..మూడు గంటల కంటే ఎక్కువ నిడివి ఉందట. దీంతో ఒక సినిమాగా చేసి కథని ట్రిమ్ చేయడం కంటే.. రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన.. ఇంకా విడుదల కాలేదు. కానీ ఒకవేళ అది నిజమైతే మాత్రం.. రామ్ చరణ్ అభిమానులకి ఇది చేదు వార్తే అవుతుంది. 

ఇప్పటికే సినిమా ఎప్పుడు పూర్తవుతుందా.. అని కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు.. రామ్ చరణ్ ఫాన్స్. ఇప్పుడు సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుంది..అంటే రెండవ పార్ట్ కోసం.. ఇంక ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందో అని తెగవైపుతున్నారు అభిమానులు.

ఎందుకంటే భారతీయుడు 2 సినిమా.. విడుదలైన తర్వాత 2025లో ఆ సినిమాకి సీక్వెల్ పూర్తి చేయాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి కూడా సీక్వెల్ అంటే.. భారతీయుడు 2 సినిమా పూర్తయ్యాక.. ఈ సినిమాని మొదలు పెట్టాలి. లేకపోతే నిన్న మొన్నటిదాకా చేసినట్లు మళ్లీ రెండు పడవల.. మీద ప్రయాణం చేసి అభిమానులను మరింత కంగారు పెట్టడం ఖాయం ఈ డైరెక్టర్.

Read more; Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News