Best Sunroof Cars: పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభించే టాప్ 6 ఎస్‌యూవీ కార్లు ఇవే

Best Sunroof Cars: దేశంలో సన్‌రూఫ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అది కూడా పనోరమిక్ సన్‌రూఫ్‌కు క్రేజ్ ఎక్కువగా ఉంది. దేశంలోని టాప్ 6 పనోరమిక్ ఎస్‌యూవీలు ఏమున్నాయో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 18, 2024, 08:39 PM IST
Best Sunroof Cars: పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభించే టాప్ 6 ఎస్‌యూవీ కార్లు ఇవే

Best Sunroof Cars: సన్‌రూఫ్‌లలో సింగిల్ పాన్, పనోరమిక్ రెండు రకాలుంటాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ అంటే జనం ఆసక్తి చూపిస్తుంటారు. కానీ బడ్జెట్ అధికంగా ఉండటంతో వెనుకంజ వేస్తుంటారు. ఈ నేపధ్యంలో 16 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్న టాప్ 6 పనోరమిక్ ఎస్‌యూవీల గురించి పరిశీలిద్దాం.

టాటా హ్యారియర్

టాటా హ్యారియర్ ధర 15.49 లక్షల్నించి ప్రారంభమౌతుంది. పనోరమిక్ సన్‌రూఫ్‌తో కలిపి వస్తోంది. ఇందులో మల్టీ కలర్ ఏంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, 6 వే పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్, ఈఎస్‌పి వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ ఏస్థర్

ఎంజీ ఏస్థర్ ధర 9.98 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో 14 ఆటోనమస్ లెవెల్ 2 ఫీచర్లు ఉన్నాయి. ఐ స్మార్ట్ 2.0, 80కు పైగా కనెక్టెడ్ ఫీచర్లతో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ప్రత్యేకతలున్నాయి.

హ్యుండయ్ క్రెటా

హ్యుండయ్ క్రెటాలో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారు ధర 10.99 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 8 వే పవర్ ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. వీటికితోడు ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉంది.

ఎంజి హెక్టార్

ఎంజి హెక్టార్ 13.99 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో సెలెక్ట్ ప్రో వేరియంట్ డ్యూయల్ పాన్ పనోరమిక్ సన్‌రూఫ్ , షైన్ ప్రో సింగల్ ప్యాన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తోంది. హెక్టార్ కేటగరీలో బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 14 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి. సన్‌రూఫ్ కోసం టచ్ స్క్రీన్ కంట్రోల్, 11 ఆటోనమస్ లెవల్ 2 ఫీచర్లు 100 కుపైగా వాయిస్ కమాండ్స్, 75 కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

కియో సెల్టోస్

కియో సెల్టోస్ ప్రారంభధర 10.89 లక్షలుగా ఉంది. ఇందులో కొత్త ఇంటీరియర్ ఏస్థెటికల్ స్టైల్‌గా ఉంటుంది. ఇందులో డ్యూయల్ పాన్ పనోరమిక్ సన్‌రూఫ్ , 10.25 ఇంచెస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ ఫుల్ డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. 

మహీంద్ర ఎక్స్‌యూవీ 700

మహీంద్ర ఎక్స్‌యూవీ 700 ప్రారంభధర 13.99 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెగ్మెంట్ ఫస్ట్ మెమరీ, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, 360 డిగ్రీలు కెమేరా విత్ ఏడీఏఎస్ టెక్నాలజీ ఉన్నాయి. 

Also read: Maruti Suzuki Fronx Sales: బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఇవీ ప్రత్యేకతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News