Maruti Suzuki Fronx Sales: బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఇవీ ప్రత్యేకతలు

Maruti Suzuki Fronx Sales: దేశ ప్రజలకు నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచిన మారుతి సుజుకి కంపెనీకు చెందిన కొత్త ఎస్‌యూవీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 18, 2024, 02:18 PM IST
Maruti Suzuki Fronx Sales: బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఇవీ ప్రత్యేకతలు

Maruti Suzuki Fronx Sales: మారుతి సుజుకి కంపెనీకు చెందిన చాలా ఎస్‌యూవీలు మార్కెట్‌లో ఉన్నాయి. అందులో ఇటీవలి కాలంలో కొత్తగా మార్కెట్‌లో వచ్చిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల్లో దూసుకుపోతూ సంచలనం రేపుతోంది. మార్కెట్‌లో సూపర్‌హిట్ అయిన ఎస్‌యూవీ ఇదే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 2023 మే నెలలో లాంచ్ అయింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ అమ్మకాల్లో గణనీయమైన వృద్ది నమోదు చేస్తోంది. కేవలం 14 నెలల వ్యవధిలో ఏకంగా 1.5 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయంటే ఈ ఎస్‌యూవీ క్రేజ్ ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. మొదటి లక్ష యూనిట్ల విక్రయానికి 10 నెలల సమయం పడితే మిగిలిన 50 వేలు కేవలం 4 నెలల్లో అమ్ముడయ్యాయి. 2024 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26,638 యూనిట్లు, రెండవ త్రైమాసికంలో 36,836 యూనిట్లు, మూడవ త్రైమాసికంలో 30,916 యూనిట్లు, నాలుగో త్రైమాసికంలో 40,432 యూనిట్ల విక్రయాలు జరిగాయి. బలేనో తరువాత అత్యధికంగా విక్రయమౌతున్న మోడల్ ఇదే. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 14,286 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. నెక్సా అత్యధికంగా విక్రయం కాగా బలేనో మాత్రం ఫ్రాంక్స్ కంటే వెనుకబడింది. కానీ మే నెలలో తిరిగి బలేనో 12,842 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో కొత్తగా అప్‌డేట్ రానుంది. కొత్త హైబ్రిడ్ ఇంజన్ జత చేయవచ్చు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్, 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 

ప్రస్తుతం మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ మోడల్స్ ఉన్నాయి. ఇవి 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తాయి. ఇందులో 9 ఇంచెస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, హెడ్స్ అప్ డిస్‌ప్లే , క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమెట్ కంట్రోల్ ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎస్‌యూవీల్లో టొయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ పోటీ పడనుంది. పరోక్షంగా అయితే హ్యుండయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎస్‌యూవీ 3XOలతో పోటీ ఉంటుంది. 

Also read: Samsung Smart Watches: శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ శాంసంగ్ గెలాక్సీ, అల్ట్రా లాంచ్ త్వరలో, ధర, ఫీచర్లు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News