తోకముడిచిన పాక్ ; బాబోయ్ యుద్ధం వద్దు.. చర్చలకు రావాలని పిలుపు

                                  

Last Updated : Feb 27, 2019, 06:09 PM IST
తోకముడిచిన పాక్ ; బాబోయ్ యుద్ధం వద్దు.. చర్చలకు రావాలని పిలుపు

ఇండో పాక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిణామాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పాక్ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడారు. ఒకసారి యుద్ధం మొదలైతే కనుక తన చేతుల్లో కానీ.. మోదీ చేతుల్లో కానీ అది ఉండదన్నారు. యుద్ధం జరిగితే రెండు దేశాలకూ నష్టమేనని.. కాబట్టి ఈ విషయంలో చర్చలకు రావాలని ఇమ్రాన్ ఖాన్ ఆకాక్షించారు. 

పుల్వామా దాడికి చింతిస్తున్నామని..ఈ విషయంలో భారత్ పడుతున్న బాధ అర్ధం చేసుకోగలమన్నారు. అయితే పుల్వామా ప్రతికార చర్య పేరుతో భారత సైన్యం తమ భూభాగంలోకి వచ్చిందని అందుకే... తాము భారత భూభాగంలోకి రావాల్సి వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ సమర్థించుకున్నారు. పుల్వామా ఘటనతో సహా ఇతర అంశాలపై భారత్ తో చర్చించేందుకు సిద్ధమని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. 

Trending News