/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Healthy Fruits On Empty Stomach: సాధారణంగా ఉదయం లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటాం. అయితే, కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం. ఇది మీకు రోజంతటికీ కావాల్సిన శక్తి అందిస్తుంది. పరగడుపున ఈ పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్‌, మినరల్స్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఓ ఆరు రకాల పండ్లు పరగడుపున తింటే ఆరోగ్యం. అవి ఏంటో తెలుసుకుందాం.

అరటిపండు..
అరటిపండు ఉదయం ఖాళీ కడుపున తింటే ఆరోగ్యం. ఎందుకంటే ఇది సులభంగా జీర్ణం అవుతుంది కూడా. ఇది మన శరీరానికి తక్షణ శక్తి కూడా అందిస్తుంది. ముఖ్యంగా అరటి పండులో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పుచ్చకాయ..
పుచ్చకాయలో నీటి శాతం అధికగంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మనకు రోజంతటికీ కావాల్సిన శక్తి లభిస్తుంది. అంతేకాదు పుచ్చకాయ మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. ఇందులో లైకోపీన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఇదీ చదవండి: కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించే గోరుచిక్కుడు.. వారానికి ఒక్కసారైనా తింటున్నారా?

బొప్పాయి..
బొప్పాయిలో పప్పెయిన్ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ముఖ్యంగా బొప్పాయిలో విటమిన్‌ ఏ, సీ, ఫోలెట్‌ కూడా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయి తీసుకుంటే ఆరోగ్యకరం. అంతేకాదు బొప్పాయి తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇది డయాబెటీస్‌ తో బాధపడేవారికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు చెక్‌ చేసుకుంటూ బొప్పాయి తినవచ్చు.

బెర్రీ పండ్లు..
ప్రత్యేకంగా బ్లూ బెర్రీలను ఉదయం ఖాళీ కడుపున తీసుకుంటే ఆరోగ్యకరం. ఎందుకంటే ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌, ఫైబర్‌ ఉంటుంది.  బ్లూబెర్రీ మెదడు ఆరోగ్యంతోపాు గుండె సమస్యలను సైతం మీ దరిచేరనివ్వదు.

ఆరెంజ్‌..
ఆరెంజ్‌లో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్‌ కూడా ఉండటం వల్ల ఉదయం ఖాళీ కడుపున తీసుకోవ వల్ల ఆరోగ్యం. ఇది మీ ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ఇదీ చదవండి:  టీ తాగుతూ ఈ 5 ఫుడ్స్‌ తింటున్నారా? మీరు తప్పు చేస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త..

యాపిల్స్‌.. 
యాపిల్స్‌లో ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. యాపిల్స్‌ తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.  ముఖ్యంగా ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. యాపిల్స్‌ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Add Thee 6 Fruits In Your Diet Then You Can See The Amazing Health Benefits rn
News Source: 
Home Title: 

Fruits On Empty Stomach: ఈ 6 పండ్లు పరగడుపున తింటే అద్భుతాలే చూస్తారు..

Fruits On Empty Stomach: ఈ 6 పండ్లు పరగడుపున తింటే అద్భుతాలే చూస్తారు..
Caption: 
Healthy Fruits On Empty Stomach
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Fruits On Empty Stomach: ఈ 6 పండ్లు పరగడుపున తింటే అద్భుతాలే చూస్తారు..
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Saturday, June 22, 2024 - 12:25
Created By: 
Renuka Godugu
Updated By: 
Renuka Godugu
Published By: 
Renuka Godugu
Request Count: 
17
Is Breaking News: 
No
Word Count: 
293