Kalki 2898 AD: దుల్కర్ సల్మాన్ పాత్ర వెనుక అసలు కథ.. కల్కి 2లో ఎలా కనిపించనున్నారంటే !

Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో.. వచ్చిన కల్కి 2898 ఏడి.. సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి సీక్వెల్ ఎలా ఉండబోతోంది.. అని కూడా పుకార్లు మొదలయ్యాయి. అయితే కల్కి మొదటి భాగంలో కనిపించిన దుల్కర్ సల్మాన్..కల్కి 2 సినిమాలో కూడా కీలక పాత్రలో.. కనిపించనున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 30, 2024, 05:47 PM IST
Kalki 2898 AD: దుల్కర్ సల్మాన్ పాత్ర వెనుక అసలు కథ.. కల్కి 2లో ఎలా కనిపించనున్నారంటే !

Kalki 2898 AD Collections: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. తెరకెక్కిన కల్కి 2898 ఏడి.. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్.. వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు.. కళ్ళు కాయలుకాచేలా.. ఎదురుచూస్తున్నారు. 

అయితే కల్కి 2 సినిమా కథ ఎలా ఉండబోతుందో.. కూడా అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుల్కర్ సల్మాన్ పాత్ర ఎలా ఉండబోతోంది అని.. వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్.. భైరవ అనే పాత్రలో.. ప్రభాస్ కి గురువు లాగా కనిపించారు. ఈ ప్రపంచంలో ఎలా బతకాలి.. అని దుల్కర్ సల్మాన్ నేర్పించినట్లు.. ప్రభాస్ చెప్తారు. 

కట్ చేస్తే..సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడి పాత్రలో చూపిస్తారు. ఇక పురాణాల ప్రకారం కర్ణుడికి గురువు.. పరశురాముడు. కర్ణుడికి విలువిద్యలు, యుద్ధపు విద్యలు నేర్పించేది పరశురాముడే. కాబట్టి కల్కి 2
. సినిమాలో దుల్కర్ సల్మాన్ పరశురాముడి పాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

పైగా పరశురాముడు కూడా చిరంజీవి. అంతే ఆయనకు ఎప్పటికీ వయస్సు అవ్వదు. కరెక్ట్ గా గమనిస్తే.. భైరవ చిన్నప్పుడు కొంచెం పెద్దయ్యాక.. దుల్కర్ సల్మాన్ ఒకే లాగా ఉన్నట్టు మనకు సినిమాలో చూపిస్తారు. కాగా అశ్వద్ధామ లాగా పరశురాముడు కూడా కల్కి ని.. కాపాడడం కోసం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కల్కి 2 సినిమాలో దుల్కర్ సల్మాన్..పరశురాముడు పాత్ర లో కల్పించనున్నారు అని టాక్ నడుస్తోంది.

తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ నిర్మాత అశ్విని దత్.. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయిపోయిందని క్లారిటీ ఇచ్చారు. అయితే మిగతా షూటింగ్ పూర్తి అవ్వడానికి.. కనీసం ఒకటిన్నర సంవత్సరం పడుతుందని అన్నారు. ఈ లెక్కన చూసుకుంటే వచ్చే ఏడాది డిసెంబర్ కి సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే కల్కి 2.. సినిమా 2026 వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఎవరెవరు క్యామియో పాత్రలలో.. కనిపించనున్నారో వేచి చూడాలి.

Also Read: Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన

Also Read: Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News