Samantha: నీకోసం ప్రార్థిస్తున్నాను.. బాలీవుడ్ నటిపై సమంత పోస్ట్ వైరల్

Samantha Instagram Post: సమంత కి తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఇక్కడే కాకుండా.. బాలీవుడ్ లో కూడా మంచి అభిమానులను సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. త్వరలోనే  సిటడేల్ వెబ్ సిరీస్ తో.. మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ క్రమంలో ఒక  బాలీవుడ్ బుల్లితెర నటి గురించి.. సమంత పెట్టిన ఒక పోస్టుగా వైరల్ అవుతుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 2, 2024, 07:36 PM IST
Samantha: నీకోసం ప్రార్థిస్తున్నాను.. బాలీవుడ్ నటిపై సమంత పోస్ట్ వైరల్

Samantha Viral Post: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమై నిజంగానే మనల్ని మాయ చేసింది ఈ హీరోయిన్. ఎన్నో సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే ఈ మధ్య తన ఆరోగ్య సమస్యల వల్ల.. సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చింది. కానీ త్వరగానే కోలుకొని.. మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఈ క్రమంలో సమంత తెలుగు సినిమాలతో పాటు.. హిందీ సినిమాల పైన కూడా తన దృష్టి పెడుతోంది.

ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకుల మదిలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొద్ది రోజుల్లోనే సిటడేల్ సిరీస్ తో మరోసారి వారిని పలకరించనుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. సమంత రియల్ లైఫ్ లో వారియర్గా నిలిచింది. నాగచైతన్యతో డైవర్స్.. వెంటనే ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటు జీవితాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ మరొక నటిని వారియర్ అనడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంది. 

అసలు విషయానికి వస్తే బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్‌ క్యాన్స‌ర్‌తో.. పోరాడుతోంది. తనకు బ్రెస్ట్ క్యాన్స‌ర్  3వ ద‌శ‌లో ఉన్న‌ట్లు ఈ మధ్యనే ఈ నటి సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఇక ఈ క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌హ‌కారంతో ఈ మ‌హ‌మ్మారి పై పోరాటం చేస్తున్న‌ట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ క‌ష్ట‌స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని, అనుభ‌వాలు, స‌ల‌హాలు, మ‌ద్ద‌తును అందించాల‌ని ఆమె అందరిని కోరారు. ఈ నేపథ్యంలో నెటిజ‌న్ల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీలోని.. ప‌లువురు సెలబ్రిటీస్ ఆమెకు ధైర్యానిస్తున్నారు.

కాగా సమంత కూడా ఆమెకు తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు వారియర్.’ అంటూ స‌మంత హీనా ఖాన్‌కు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పోస్ట్ కు హీనా రిప్లై ఇస్తూ.. ‘సామ్ మీరు అన్నింటిలోనూ.. నిజ‌మైన సూపర్ స్టార్‌. జీవితంలో మీకు ఎదురైన స‌వాళ్ల‌ను మీరు హ్యాండిల్ చేసిన విధానం ఎంతో అద్భుతం. మీ గురించి తెలుసుకుని ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ‌, ఆశీర్వ‌దాల‌కు ధ‌న్య‌వాదాలు.’ అంటూ జవాబు ఇచ్చింది.

ప్రస్తుతం వీరిద్దరూ పట్టిన ఈ ఇంస్టాగ్రామ్ స్టేటస్ తెగ వైరల్ అవుతూ.. ఇద్దరు అభిమానులను ఆకట్టుకుంటుంది.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News