Pregnant Woman Delivers On Bus: ప్రయాణం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. భరించలేని నొప్పులతో తల్లాడిన ఆ మహిళను చూసిన కండక్టర్ స్పందించారు. ఆమెను డాక్టర్ అవతారం ఎత్తి ప్రసవం చేశారు. ఫలితంగా ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం పూట మహాలక్ష్మి పుట్టిందని బస్సులో ఉన్న ప్రయాణికులు భావించారు. కాగా సమయస్ఫూర్తితో పురుడు పోసిన మహిళా కండక్టర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళా కండక్టర్‌పై ఆర్టీసీ చైర్మన్ వీసీ సజ్జనార్ అభినందించారు. ఈ విషయాన్ని 'ఎక్స్' ద్వారా సజ్జనార్ పంచుకున్నారు.
Also Read: Hyderabad Metro: భద్రతా ప్రమాణాల్లో నంబర్ వన్ హైదరాబాద్ మెట్రో.. గోల్డెన్ పీకాక్ అవార్డు సొంతం
ఏం జరిగింది?
ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణి ఆరాంఘర్‌లో ఎక్కారు. ప్రయాణం చేస్తున్న క్రమంలో బహదూర్‌పుర వద్దకు చేరుకోగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్ సరోజ వెంటనే అప్రమత్తమయయారు. మహిళా ప్రయాణికుల సాయంతో ఆమె సాధారణ ప్రసవం చేశారు. అందరి సహాయంతో శ్వేతా రత్నం సురక్షితంగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
Also Read: Chalo TGPSC: పోలీస్ నిర్బంధాల మధ్య నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్
అధికారుల అభినందన
బస్సులో ప్రసవించిన మహిళ, నవజాత శిశువు ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడంతో తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని కొనియాడారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటంపై ప్రశంసలు కురిపించారు.
కాగా బస్సులో ప్రసవం కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. అయితే బస్సులో పుట్టిన ప్రతి బిడ్డకు జీవితాంతం ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ పాపకు కూడా జీవితకాల ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారా లేదా అనేది చూడాలి. ప్రశంసనీయమని అన్నారు.
బస్సులోనే ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం#TGSRTC బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. #Hyderabad ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్… pic.twitter.com/7ISJM8fDJ5
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 5, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి