కేసీఆర్‌కు దమ్ముంటే ఆంధ్రాలో నేరుగా పోటీ చేయాలి: నారా లోకేష్

కేసీఆర్‌కు దమ్ముంటే ఆంధ్రాలో నేరుగా పోటీ చేయాలి: నారా లోకేష్

Last Updated : Mar 24, 2019, 02:06 PM IST
కేసీఆర్‌కు దమ్ముంటే ఆంధ్రాలో నేరుగా పోటీ చేయాలి: నారా లోకేష్

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపి అభ్యర్థిగా పోటీచేస్తోన్న ఏపీ మంత్రి, నారా లోకేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సవాల్ విసిరారు. జగన్‌ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ దగ్గర తాకట్టుపెట్టారని ఆరోపించిన నారా లోకేష్.. కేసీఆర్‌కు దమ్ముంటే ఆంధ్రాలో నేరుగా పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ... తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చిందని, అందుకే చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పోటీ పడలేకే మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలోని రేవేంద్రపాడులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News