BRS Party MLAs: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక.. కీలక కార్యక్రమానికి సగం మంది డుమ్మా

Major BRS Party MLAs Not Attended Speaker Complaint Programme: పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగలనుందా అంటే ఔననే తెలుస్తోంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేసే సమయంలో సగం మంది డుమ్మా కొట్టడం కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 16, 2024, 08:13 PM IST
BRS Party MLAs: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక.. కీలక కార్యక్రమానికి సగం మంది డుమ్మా

BRS Party MLAs: తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇంకా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. తాజాగా ప్రొటోకాల్‌ అంశం, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసే సమయంలో కూడా గులాబీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమానికి చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేసే సమయంలో సగం మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా సగం మంది దూరంగా ఉన్నారు. దీంతో గులాబీ పార్టీలో చీలిక ఏర్పడిందని తెలుస్తోంది.

Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిని సస్పెండ్‌ చేయాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు గౌరవం లభించడం లేదని.. అధికారులు ప్రొటొకాల్‌ విస్మరిస్తున్నారని స్పీకర్‌కు వివరించారు.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?

గతంలో హుజురాబాద్‌, మల్కాజిగిరితోపాటు తాజాగా మహేశ్వరంలో జరిగిన ప్రొటొకాల్‌ వివాదాన్ని స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివరించారు. తమకు ప్రభుత్వ కార్యక్రమాల్లో గౌరవం కల్పించాలని.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిరాయింపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

సగం మంది డుమ్మా
ఫిరాయింపులు, ప్రొటొకాల్‌ అంశంపై ఫిర్యాదు చేసే కార్యక్రమానికి సగం మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే 24 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. అసెంబ్లీలో ఫిర్యాదుకు చేసే కార్యక్రమంలో 14 మంది హాజరయ్యారు. మిగతా 14 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గైర్హాజరైన వారిలో మాజీ సీఎం కేసీఆర్‌ కూడా ఉన్నారు. ఆయనను మినహాయిస్తే గైర్హాజరైన మిగతా 13 మంది పార్టీ మారుతారని చర్చ నడుస్తోంది.

హజరైన 14 ఎమ్మెల్యేలు

  • కేటీఆర్ - సిరిసిల్ల
  • హరీష్ రావు - సిద్దిపేట
  • సునీత లక్ష్మారెడ్డి - నర్సాపూర్‌
  • సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
  • చింత ప్రభాకర్ - సంగారెడ్డి
  • మాణిక్ రావు - జహీరాబాద్‌
  • మాగంటి గోపీనాథ్ - జూబ్లీహిల్స్‌
  • కేపీ వివేకానంద - కుత్బుల్లాపూర్‌
  • పద్మారావు గౌడ్ - సికింద్రాబాద్‌
  • కాలేరు వెంకటేష్ - అంబర్‌పేట
  • మాధవరం కృష్ణారావు - కూకట్‌పల్లి
  • మర్రి రాజశేఖర్ రెడ్డి - మల్కాజిగిరి
  • డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ - కోరుట్ల
  • ముఠా గోపాల్ - ముషీరాబాద్‌

గైర్హాజరైన 14 మంది ఎమ్మెల్యేలు

  • కేసీఆర్- గజ్వేల్ ఎమ్మెల్యే
  • దేవిరెడ్డి సుధీర్ రెడ్డి - ఎల్బీనగర్ ఎమ్మెల్యే
  • బండారు లక్ష్మారెడ్డి - ఉప్పల్ ఎమ్మెల్యే
  • చామకూర మల్లారెడ్డి - మేడ్చల్ ఎమ్మెల్యే
  • కొత్త ప్రభాకర్ రెడ్డి - దుబ్బాక ఎమ్మెల్యే
  • తలసాని శ్రీనివాస్ యాదవ్  - సనత్ నగర్ ఎమ్మెల్యే
  • జగదీశ్‌ రెడ్డి - సూర్యాపేట ఎమ్మెల్యే
  • గంగుల కమలాకర్ - కరీంనగర్ ఎమ్మెల్యే
  • కోవ లక్ష్మీ - ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
  • అనిల్ జాదవ్ - బోధ్ ఎమ్మెల్యే
  • విజేయుడు - ఆలంపూర్ ఎమ్మెల్యే
  • పాడి కౌశిక్ రెడ్డి - హుజురాబాద్ ఎమ్మెల్యే
  • వేముల ప్రశాంత్ రెడ్డి - బాల్కొండ ఎమ్మెల్యే
  • పల్లా రాజేశ్వర్ రెడ్డి - జనగాం ఎమ్మెల్యే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News