Devara: దేవర సినిమాలో విలన్ గా కనిపించనున్న హీరోయిన్.. ఎవ్వరు ఊహించని ట్విస్ట్!

Janhvi Kapoor Telugu Debut: జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్టీఆర్.. దేవరతో టాలీవుడ్ కి పరిచయం కానుంది. అయితే దేవరలో.. ఈమె పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ఈ సినిమాతో ఆమె నటిగా ఒక కొత్త కోణం చూపించనుంది.. అని టాక్ నడుస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 17, 2024, 07:23 PM IST
Devara: దేవర సినిమాలో విలన్ గా కనిపించనున్న హీరోయిన్.. ఎవ్వరు ఊహించని ట్విస్ట్!

Janhvi Kapoor in NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకి..దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్.. వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న.. రెండవ సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

లెజెండరీ నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె.. జాన్వీ కపూర్.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. 

అయితే తాజాగా జాన్వీ కపూర్.. పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ పాత్రకి.. బోలెడు షేడ్స్ ఉంటాయట. ముఖ్యంగా ఆమె పాత్రకి నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. దీంతో కొంపదీసి.. జాన్వి కపూర్ హీరోయిన్ కాకుండా విలన్ పాత్ర పోషించడం లేదు కదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గానే నటిస్తూ ఉన్నప్పటికీ, అనే పాత్ర ఒక ట్విస్ట్ కూడా తీసుకువస్తుందని, అది ప్రేక్షకులను.. థ్రిల్ చేస్తుందని తెలుస్తోంది. ఇందులో ఎంతో కొంత నిజం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ లో.. కూడా జాన్వీ కపూర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగానే ఉంటుంది. 

ఏదో ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకునే జాన్వి.. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలో జాందీ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు.
 
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. టామ్ షైన్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.

Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు

Also Read: Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News