ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?

Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న చివరి తేదీని పొడిగించాలంటూ ఇప్పుడిప్పుడే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి కొన్ని సాంకేతిక కారణాలను కూడా నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Jul 21, 2024, 03:51 PM IST
ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?

ITR Filing Deadline:ఆదాయపన్ను రిటర్న్ ఫైలింగ్ (ITR Filing) చివరి తేదీ జూలై 31 సమీపిస్తోంది.ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ కూడా వేగంగా ఫైల్ చేస్తున్నారు. జూలై 20, 2024 నాటికి, దాదాపు 3.5 కోట్ల మంది ఇప్పటికే తమ ఐటీఆర్‌ను దాఖలు చేశారు. ఇది గత ఏడాది కంటే దాదాపు 13 శాతం ఎక్కువ. జూలై 13 తేదీన అత్యధికంగా ఒకే రోజు 13 లక్షల మందికి పైగా ప్రజలు ITR దాఖలు చేశారు.ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఆదాయపు పన్ను దాఖలుకు చివరి తేదీని జూలై 31 తర్వాత పొడిగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ సంఘాలు కూడా చివరి తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేసి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయపు పన్ను పోర్టల్‌లో తలెత్తే అనేక సమస్యల గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేసింది. 

Also Read : Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!

ఆదాయ పన్ను పోర్టల్ లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి?

- ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో 26AS/AIS/TIS వంటి ఫారమ్‌లను యాక్సెస్ చేయడంలో సమస్యలు తలెత్తున్నాయి. 

-ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి పోర్టల్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేస్తున్నారు.సిస్టమ్‌పై అధిక లోడ్ కారణంగా ఈ అంతరాయాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్వీసులకు అంతరాయం వాటిల్లుతోంది. దీని కారణంగా, పోర్టల్‌లోని ఇతర అంశాలు కూడా ప్రభావితమవుతున్నాయి.

-ఆదాయపు పన్ను పోర్టల్‌లో ముందస్తుగా పూరించిన డేటా, ఫారమ్ 26AS/AISలో అందుబాటులో ఉన్న సమాచారం మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో అయోమయం నెలకొంది. 

-OTP జనరేషన్ కాకపోవడంతో,పన్ను చెల్లింపుదారులు తమ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్య వల్ల ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు ఆలస్యం అవుతోంది.

- ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఎర్రర్ మెసేజ్‌లు వస్తున్నాయి.OTPలో సమస్యలు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది చివరి తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

చివరి తేదీని పొడిగిస్తారా?

ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో ఇన్ని సమస్యలు ఎదురవుతున్న వేళ,ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే చివరి తేదీని పొడిగిస్తారా ? అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. తేదీని పొడిగించాలా? వద్దా? అనేది ఆదాయపు పన్ను శాఖ నిర్ణయిస్తుంది కాబట్టి ఇప్పటికి దీనిపై ఎవరూ స్పందించడం లేదు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని,ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని పొడిగించకపోవచ్చని చాలా మంది నిపుణులు గత అనుభవాల దృష్ట్యా చెబుతున్నారు.

Also Read:Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News