Wrong Route Accident: హైదరాబాద్‌లో తెల్ల తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యువకులు చేసిన తప్పిదమే వారి ప్రాణాలు బలి తీసుకుంది. బుల్లెట్ బండిపై రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ ఒక్కసారిగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. వారి వేగానికి బస్సు కింద కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో వారిద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగింది. ఎదిగి వచ్చిన పిల్లలు అకాల మృతితో ఆ కుటుంబాలు పుత్రశోకంతో తల్లడిల్లాయి.
Also Read: Armaan Kritika Malik: బిగ్‌బాస్ షోలో 'ఆ పని' కానిచ్చేసిన కంటెస్టెంట్లు.. షో బ్యాన్‌కు డిమాండ్
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందానగర్ శాంతి నగర్‌లో మనోజ్ (23), రాజు (26) నివసిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున మదీనాగుడ జీఎంఎస్ మాల్ నుంచి చందానగర్‌కు మనోజ్, రాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై బయటకు వచ్చారు. ఈ క్రమంలో తిరిగి బయల్దేరుతున్న సమయంలో వారిద్దరూ బుల్లెట్ బండిపై రాంగ్‌రూట్‌లో ప్రయాణం చేశారు. చందానగర్ జేపీ మాల్ సమీపంలో యూ టర్న్ వద్ద రాంగ్ రూట్‌లో వెళ్లారు.
Also Read: Necklace At Garbage: చెత్తకుప్పలో వజ్రల హారం.. గంటల్లో కార్మికులు ఏం చేశారో తెలుసా?
ఈ సమయంలో చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆ ఇద్దరు యువకులు ఢీకొట్టారు. బైకు నడుపుతున్న మనోజ్ వెనుక కూర్చోని ఉన్న రాజులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలకు గురయిన వారిద్దని స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో పరిస్థితి విషమించి మనోజ్, రాజు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మోటార్ వెహికిల్ యాక్టు కింద పలు సెక్షన్లపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తరచూ ప్రమాదాలు
మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఉంటున్న యువత అర్ధరాత్రిళ్లు ఆరు బయట తిరుగుతూ హల్‌చల్ చేస్తున్నారు. పార్టీలు, విందు, రాత్రిపూట టిఫిన్లు, చాయ్ కోసం తిరుగుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రద్దీ లేని రోడ్లపై రయ్య్‌న వాహనాలు తోలుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని నెలలుగా ఇలాంటి ప్రమాదాలు తీవ్రమవుతున్నాయి. జేఎన్టీయూహెచ్ వద్ద గతంలో కూడా ఇద్దరు యువకులు మృతి చెందారు. నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో కుటుంబాలు తీవ్ర దుఖితమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి