Ajith Kumar In Jai Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమన్ సినిమా చాలా తక్కువ అంచనాల మధ్య.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో హనుమంతుని పాత్రలో ఎవరు నటించనున్నారు అని.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిపోయాయి. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం వేరే సినిమాలు తో బిజీగా ఉండటం వల్ల.. ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్రం నిర్మాత చైతన్య రెడ్డి.. సినిమాలో హనుమంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్ అయితే బాగుంటుంది అని అన్నారు. ఆ వార్త వైరల్ గా మారింది. దీంతో కచ్చితంగా మెగా హీరోలలో ఎవరో ఒకరిని.. సినిమాలో హనుమంతుని పాత్ర కోసం రంగంలోకి దింపుతారు అనే అందరూ అనుకున్నారు.
స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి.. చిరంజీవి అయితే చాలా బాగుంటుంది అని మెగా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం వరుస సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. కానీ డెప్త్ ఉన్న పాత్ర కాబట్టి ఎవరైనా స్టార్ హీరో చేస్తేనే బాగుంటుంది అని ప్రశాంత్ వర్మ అనుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ అజిత్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులలో తెలియని వారు ఉండరు. డబ్బింగ్ సినిమాలతో అజిత్ తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరయ్యారు. పైగా ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. కాబట్టి చిరంజీవి కాకపోతే అజిత్ ఈ పాత్రకి బాగా సెట్ అవుతారని ప్రశాంత్ వర్మ అనుకున్నారట.
ఒకవేళ అదే నిజమైతే ఈ సినిమాకి తెలుగులో మాత్రమే కాక తమిళ్లో కూడా బోలెడంత క్రేజ్ వస్తుంది. ఏదేమైనా సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంకా ఎదురు చూస్తున్నారు.
Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి