Peka Medalu Review: టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో.. పేక మేడలు అనే చిత్రం.. ప్రీమియర్లు కేవలం 50 రూపాయలే అంటు ప్రకటించడంతో.. ఈ సినిమాపై అందరి దృష్టిపడింది. అంతేకాకుండా ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో వినోద్ కిషోర్ హీరోగా నటించగా.. అనుషా కృష్ణ హీరోయిన్ గా నటించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 19న విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ నుంచే మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రాన్ని.. తాజాగా జులై 26 నుంచి నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరఫున యూఎస్ఏ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
కాబట్టి ఈరోజు నుంచి ఈ సినిమా యూఎస్ లో సైతం సంచదనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఒక సినిమా చూడాలంటే కనీసం 300 టికెట్ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఈ సినిమా నిర్మాతలు ఈ చిత్రానికి 100 రూపాయలకే టికెట్ రేట్లు పెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలాగా చేశారు. కలెక్షన్స్ కోసం కాకుండా మంచి సినిమాని.. ప్రేక్షకులు చూపించాలని.. ఈ చిత్రం టికెట్ రేట్లు చాలా తక్కువ ధరకే ఇచ్చారు. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న వచ్చిన ఈ చిత్రం ప్రతి మహిళా చూడాలనేది.. తమ ఉద్దేశం అంటూ నిర్మాతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే మాట్లాడుతూ : ‘విడుదలైన ఫస్ట్ షో నుంచే మా సినిమాని ఆదరించి.. ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు సిని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా టికెట్ రేట్ తక్కువ పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాని చూడగలిగారు. అందుకే ఇప్పుడు మా చిత్రాన్ని నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈనెల 26 నుంచి యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడి వాడు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు అని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో వినోద్ కిషన్ తో పాటు అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి