Ajay Gadu Movie Review: ‘అజయ్ గాడు’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

Ajay Gadu Movie Review: గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అజయ్ గాడు’. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది చూడాలి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 27, 2024, 06:45 PM IST
Ajay Gadu Movie Review: ‘అజయ్ గాడు’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

మూవీ: ‘అజయ్ గాడు’ (రివ్యూ)
నటీనటులు: అజయ్ కతుర్ వార్, ప్రాచీ, భాను శ్రీ, శ్వేత మెహతా, అభయ్ బేతిగంటి, యాదమ్మ రాజు తదితరులు
సంగీతం: కార్తీక కడగండ్ల
నిర్మాత: అజయ్ కతుర్ వార్
రైటర్ : అజయ్ కతుర్ వార్
దర్శకత్వం: అజయ్ కతుర్ వార్

గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే హీరోలు.. కేవలం తెర ముందు మాత్రమే కాదు.. తెర వెనక అన్ని శాఖల్లో ముఖ్యంగా డైరెక్షన్ చేస్తున్నారు. ఈ కోవలో అజయ్ గాడు సినిమాతో అజయ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..

కథ విషయానికొస్తే..

అజయ్ (అజయ్ కుమార్ కతుర్వార్) సినిమా మేకింగ్ అతని డ్రీమ్. ఓ సినిమాను తెరకెక్కించి హిట్టు కొట్టాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలో ఓ శ్రీమంతుడి కుమార్తెను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమె తండ్రితో ఇతనికి విభేదాలు వస్తాయి. ఈ క్రమంలో డాక్టర్ శ్వేత ఇతన్ని సమస్యల సుడి గుండం నుంచి బయట పడేస్తోంది. ఇంతకీ డాక్టర్ శ్వేత ఎవరు ? అజయ్ తన సినిమా డ్రీమ్ నెరవేర్చుకున్నాడా.. ? ఈ క్రమంలో తన లవ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిండా.. ? ఈ నేపథ్యంలో అతను ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే అజయ్ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ సినిమాకు అజయ్ నటించడమే కాదు.. ఆయనే నిర్మాత, దర్శకుడిగా.. రచయతతో పాటు నటుడిగా ఎన్నో బాధ్యతలను తన భుజాలపై మోసాడు.  మొత్తంగా ఓ సామాన్యుడు సినిమా తెరకెక్కించాలనే తన డ్రీమ్ ను ఎలా నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడనేది తెరపై ఎంతో ఉద్విగ్నభరితంగా ప్రేక్షకులు ఎంగేజ్ చేసేలా తెరకెక్కించాడు. అక్కడక్కడ లాజిక్ మిస్ అయినా.. ఓవరాల్ గా ఓ కామన్ ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా స్క్రిప్ట్ ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అంతేకాదు ఇప్పటి యూత్ కు కావాల్సిన కొన్ని మాస్ మసాలను కూడా ఈ సినిమాలో జోడించాడు. సినీ ఇండస్ట్రీలో అదే నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. అందులో ఈ సినిమాను ఖచ్చితంగా ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు ఈ సినిమాలోని హీరో పాత్రతో కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకు కథ, నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు నిర్మాతగా ఎక్కడా రాజీ  పడకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు.  

ఈ సినిమాను తక్కువ నిడివితో తెరకెక్కించడం ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విశాల్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫీ బాగుంది. మొత్తంగా మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
అజయ్ కుమార్ కొత్తవాడైన మంచి ఈజ్ తో నటించాడు. తన పాత్రను రాసుకున్న విధానంతో పాటు దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. అంతేకాదు తన మార్క్ యాక్షన్, డాన్స్, డైరెక్షన్ అన్ని విభాగాల్లో తన మార్క్ చూపించే ప్రయత్నం చేసాడు. భానుశ్రీ తన అంద చందాలతో అలరించింది. రూపా పాత్రలో ప్రాచీ థక్కర్ నటన బాగుంది. డాక్టర్ పాత్రలో శ్వేత మెహత నటన మెప్పిస్తుంది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించాడు.

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News