Gold Price Today: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పతనం అవుతున్నాయి.అయితే ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక మద్యలోనే ఆగిపోతుందా? బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా లేదా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో నెలకొని ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరల కదలిక ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today Gold Rates: మనదేశంలో బంగారం ధరలు గడచిన వారం రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టాయి. గతంలో గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయల నుంచి బంగారం ధరలు ప్రస్తుతం 68000 వరకు పతనమ య్యాయి. అంటే సుమారు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై దాదాపు 7వేల రూపాయల వరకు తగ్గింది. అయితే బంగారం ధరలు ఈ రేంజ్ లో తగ్గడం వెనుక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. గోల్డ్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో అటు పసిడి ప్రియులు భారీగా ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు శ్రావణమాసం కూడా ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో వివాహాది శుభకార్యాలు అత్యధికంగా జరిగే ఈ మాసంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వల్ల ఆభరణాల దుకాణాలన్నీ కూడా సందడిగా మారాయి.
అయితే ఇదంతా ఒక ఎత్తైతే పసిడి ప్రియులు బంగారం ధరలు మరింత తగ్గుతాయా అని ఆరా తీస్తున్నారు. కానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను చూసినట్లయితే పసిడి ధరలు ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఒక రకంగా పసిడి ప్రియులకు షాకింగ్ వార్త అనే చెప్పాలి.
ప్రస్తుతం ఇన్ని రోజులపాటు దేశీయంగా ఉన్నటువంటి సుంకాలను కలుపుకొని బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కానీ ప్రస్తుతం సుంకాలను తగ్గించడంతో బంగారం ధరల్లో కాస్త కరెక్షన్ కనిపించింది. అయితే అటు అంతర్జాతీయంగా మాత్రం పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని బులియన్ మార్కెట్ పండితులు చెబుతున్నారు.
బంగారం ధరలు భారీగా పెరిగేందుకు ప్రధాన కారణం అమెరికాలోని ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను స్థిరంగా ఉంచడమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం ద్వారా మార్కెట్లో స్తబ్దత నెలకొంది. ఫలితంగా బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ - పాలస్తీనా ఉద్రిక్తత కూడా అంతర్జాతీయంగా పసిడి మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
మార్కెట్లలో బంగారం ధర ప్రస్తుతం పెరుగుతూనే ఉంది. కామెక్స్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ప్రస్తుతం బంగారం ధర ఒక ఔన్సు కు 2487 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గడచిన సంవత్సర కాలంగా అంతర్జాతీయంగా బంగారం ధర 17 శాతం పెరిగింది. ఇక ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం హై వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి ధర ఇప్పటికే అమెరికా మార్కెట్లో 2500 డాలర్లు దాటింది.
ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం కారణంగా బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తున్న ఇన్వెస్టర్లు అందులో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం త్వరలోనే ఒక ఔన్సు ధర 2800 డాలర్లు పెరిగే అవకాశం ఉంటుంది.