Anand Mahindra appointed as young india skill university chairman: పెట్టుబడులను ఆకర్శించడమే టార్గెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అమెరికా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా.. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో స్కిల్ యూనీవర్సీటీ బిల్లులను ఆమెదించడంతో పాటు,రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట వద్ద సీఎం శంఖుస్థాపన సైతం చేశారు. ఈ క్రమంలో ఆరు కోర్సులలోయూనీవర్సీటీనీ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. యూనీవర్సీటీకీ ఛాన్స్ లర్ గా గవర్నర్ లేదా సీఎం ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ ప్రముఖులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తామని కూడా ఇదివరకు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా పర్యటలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను స్కిల్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా ప్రకటించారు. మరో రెండు రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి న్యూయార్క్ లో ఎన్నారైలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా యువతలో టెక్నాలజీలో క్రియేటివిటీ పెంచడంకోసం స్కిల్ యూనివర్సీటీ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని, అదే విధంగా ఇంకా మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరముందని సీఎం రేవంత్ అన్నారు.
Read more: Snake: వామ్మో.. వనపర్తిలో కలకలం.. ఇంట్లో దూరిన పదడుగుల భారీ సర్పం.. వైరల్ గా మారిన వీడియో..
ప్రస్తుతం.. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్, హైటెక్ సిటీ నిర్మించామని.. 159 కిలో మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే... త్వరలో 250 కిలో మీటర్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే.. రీజినల్ రింగ్ రోడ్డు వడ్డాణం అవుతుందని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్‌గా మూడు లేయర్ల కింద తెలంగాణ రాష్ట్రాన్ని మెగా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter