కౌంటింగ్ సమయంలో ఒక వేళ ఈవీఎంలో సమస్యలు వస్తే...?

రాజకీయ పార్టీల అభ్యంతాలపై క్లారిటీ ఇచ్చిన ఈసీ

Last Updated : May 22, 2019, 07:51 PM IST
కౌంటింగ్ సమయంలో ఒక వేళ ఈవీఎంలో సమస్యలు వస్తే...?

మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసీ ఎన్నికల కౌంటింగ్ కు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ తేలిపోనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. అప్పటి కల్లా  చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉంది. కౌంటింగ్ సందర్భంలో ఒక్క వేళ ఈవీఎంలో సాంకేతిక సమస్యలు వస్తే  వీవీప్లాట్ స్పిప్పుల్ని లెక్కించనున్నారు.

లాటరీ విధానం ద్వారా ఎంపిక

ఒక్కో నియోజకవర్గానికి ఐదు ఈవీఎంలు చొప్పున ఎంపిక చేసి వీవీప్లాడ్లలోని స్పిప్పుల్లు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. స్లిప్పుల లెక్కింపు కోసం వీవీప్యాట్లను లాటరీ తీసి ఎంపిక చేయనున్నారు. ఇలా వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రెస్ మీట్ లో ఈ మేరకు స్పందించారు
 

Trending News