Orphanage Home: రాఖీ రోజు ఘోర విషాదం.. కలుషిత ఆహారంతో నలుగురు అనాథ విద్యార్థులు మృతి

Orphan Students Died With Food Poison: రాఖీ పండుగ రోజు ఘోర సంఘటన చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని నలుగురు అనాథ విద్యార్థులు కన్నుమూయడంతో తీవ్ర విషాదం అలుముకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 19, 2024, 04:14 PM IST
Orphanage Home: రాఖీ రోజు ఘోర విషాదం.. కలుషిత ఆహారంతో నలుగురు అనాథ విద్యార్థులు మృతి

Orphan Students: రాఖీ పండుగ రోజే ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. అనాథాశ్రయంలో ఉంటున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 27 మంది అస్వస్థతకు గురవగా వారిలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. అస్వస్థతకు లోనయిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వారికి అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. ఈ సంఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: Raksha Bandhan: రాఖీ కడితే చనిపోతారంట.. రాఖీ పండుగ చేసుకుంటే విషాదాలే!

అనకాపల్లి జిల్లా కోటఉరట్ల మండలం కైలాసపట్నంలో పాషా ట్రస్ట్ అనాథాశ్రయం ఉంది. ఈ అనాథాశ్రమాన్ని పాస్టర్ అరుణ్ కిరణ్ నిర్వహిస్తున్నారు. ఇందులో 85 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి వసతి, విద్య సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆదివారం సాయంత్రం భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో పదుల సంఖ్యలో విద్యార్థులు బాధపడుతుండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘోర విషాదానికి కారణం ఆహారం కలుషితమై ఉంటుందని పోలీస్‌ యంత్రాంగం భావిస్తోంది.

Also Read: Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?

 

మృతులు వీరే..
కొయ్యూరు మండలం రెల్లాలపాలెం గ్రామం విద్యార్థి భవానీ
చింతపల్లి మండలం కిటమ్ముల పంచాయతీ నిమ్మలపాలెం విద్యార్థి శ్రద్ధ
కొయ్యూరు మండలం  రెల్లాలపాలెం గేమ్మిల విద్యార్థి నిత్య (3వ తరగతి)
చింతపల్లి మండలం నిమ్మల పాలెం విద్యార్థి తాంబేలా జాషో (3వ తరగతి)

విచారణకు ఆదేశం
అస్వస్థతకు గురయిన 23 మంది విద్యార్థులను నర్సీపట్నం, అనకాపల్లి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చంద్రబాబు, నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఘటనకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాగా సంఘటన తెలుసుకున్న వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత విద్యార్థులను పరామర్శించారు. ఘటనకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News