Pan Card Correction: పాన్ కార్డు, ఆధార్ కార్డులో మీ పేరు తేడా ఉందా, ఇలా సరిచేసుకోవచ్చు

Pan Card Correction: ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు , పాన్ కార్డు అనేవి కీలమైన డాక్యుమెంట్లుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఈ రెండూ అవసరం. చాలామందికి ఈ రెండు కార్డుల్లో ఉండే పేర్లు లేదా ఇంటి పేర్లు మ్యాచ్ కావు. తప్పులు దొర్లుతుంటాయి. వీటిని ఎలా సరి చేసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 19, 2024, 07:47 PM IST
Pan Card Correction: పాన్ కార్డు, ఆధార్ కార్డులో మీ పేరు తేడా ఉందా, ఇలా సరిచేసుకోవచ్చు

Pan Card Correction: సాధారణంగా ఆధార్ కార్డు, పాన్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉండవచ్చు లేదా షార్ట్ కట్‌లో ఉండవచ్చు లేదా తప్పులు ఉండవచ్చు. కొన్నింటిలో ఇంటి పేరే మిస్ అవుతుంటుంది. మొత్తానికి ఆధార్ కార్డు, పాన్ కార్డులో రెండింటిలోనూ ఒకేలాపేరు ఉండకపోవచ్చు. రెండింట్లో మీ పేరు మ్యాచ్ కాకపోతే పనులు సజావుగా పూర్తి కావు. మరి వీటిని ఆన్‌లైన్‌లో ఎలా సరి చేసుకోవాలో తెలుసుకుందాం

ప్రభుత్వ పని అయినా లేక ప్రైవేట్ పని అయినా ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండూ అవసరమౌతుంటాయి. ఈ రెండూ ఐడీ ప్రూఫ్‌గా పరిగణిస్తుంటారు. ఈ రెండింట్లో వివరాలు మ్యాచ్ కాకపోతే పనులు ఆగిపోతుంటాయి. అందుకే రెండింట్లో పేరు ఇతర వివరాలు సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డులో కూడా ఇలానే ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంట్లోంచే ఆన్‌లైన్ విధగానంలో సరిచేసుకోవచ్చు. 

దీనికోసం ముందుగా  ఇన్‌కంటాక్స్ అధికారిక వెబ్‌సైట్ www.incometaxindia.gov.in ఓపెన్ చేయాలి. మీ పాన్ కార్డు నెంబర్ ఆధారంగా లాగిన్ అవాలి. ఇప్పుడు పాన్ కార్డు కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి.  అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ ఫామ్ ప్రెస్ చేసి కరెక్షన్ ఫీజు 106 రూపాయలు చెల్లించాలి. ఫీజు చెల్లించాక సబ్మిట్ చేస్తే మీకొక రిసీప్ట్ అందుతుంది. ఈ రిసీప్ట్ నెంబర్ ఆధారంగా మీ పాన్ కార్డు స్టేటస్ చెక్ చేయవచ్చు. కరెక్షన్ చేసిన పాన్ కార్డు నేరుగా మీ ఇంటికి వస్తుంది. 

ఆఫ్‌లైన్ కరెక్షన్ ఎలా చేయాలి

పాన్ కార్డులో కరెక్షన్ ఉంటే ఆన్‌లైన్ విధానంలోనే కాకుండా ఆఫ్‌లైన్ కూడా సరిచేయవచ్చు. దీనికోసం సమీపంలోని పాన్ కార్డు ఫెసిలిటీ సెంటర్‌కు వెళ్లాలి. పాన్ కార్డు కరెక్షన్ ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి ఇవ్వాలి. అన్నీ సబ్మిట్ చేసిన తరువాత కొద్దిరోజుల్లోనే అంటే 10 రోజుల్లోనే మీ ఇంటికి పాన్ కార్డు వచ్చేస్తుంది.

Also read: Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News