Payel Mukherjee: కలకత్తాలో మరో దారుణం.. జులాయిల వేధింపులతో గుక్కపెట్టి ఏడ్చిన స్టార్‌ హీరోయిన్‌ 

Shocking Incident: వైద్యురాలి అత్యాచారం సంఘటనతో అట్టుడుకుతున్న కలకత్తాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. హీరోయిన్‌ను వేధింపులకు పాల్పడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 23, 2024, 10:08 PM IST
Payel Mukherjee: కలకత్తాలో మరో దారుణం.. జులాయిల వేధింపులతో గుక్కపెట్టి ఏడ్చిన స్టార్‌ హీరోయిన్‌ 

Payel Mukherjee Assaulted: ఆస్పత్రిలో వైద్యురాలిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు వారాలుగా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే ఓ స్టార్‌ హీరోయిన్‌ను ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. ప్రయాణిస్తున్న ఆమె కారును ఢీకొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఆమె వెంటనే తన సామాజిక మాధ్యమాల్లో లైవ్‌ ఏర్పాటుచేసిన జరిగిన ఉదంతాన్ని వివరించారు. ఈ సంఘటన మళ్లీ కలకత్తాలో అలజడి రేపింది.

Also Read: Zee Telugu: అదరగొడుతున్న జీ తెలుగు సీరియల్స్... ఇక నుంచి వీకెండ్‌లోనూ

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పాయల్‌ ముఖర్జీ బెంగాలీ సినిమాలతోపాటు తెలుగులోనూ నటించారు. అక్కడి ప్రేక్షకులకు వినోదం అందిస్తూ సినిమాలు చేసుకుంటున్నారు. అయితే కలకత్తాలో శుక్రవారం సాయంత్రం తన కారులో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి దిగేసి కారు వద్దకు వచ్చి కిటికీ అద్దం తీయమని బెదిరించాడు. దూషిస్తూ కారు చుట్టుముట్టాడు.

Also Read: Allu Arjun : మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కౌంటర్.. ఫైనల్ గా కాంట్రవర్సీపై క్లారిటీ..!

ఈ సంఘటనతో భయాందోళన చెందిన పాయల్‌ కిటికీ అద్దం తీయకుండా కారులోనే ఉండిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన కొందరు యువకులు వెంటనే కిటికీ అద్దాన్ని పగులగొట్టారు. ఈ పరిణామంతో మరింత భయపడిన పాయల్‌ వెంటనే సామాజిక మాధ్యమాల్లో లైవ్‌ పెట్టారు. అక్కడ జరిగిన ఉదంతాన్ని మొత్తం వివరించారు. అద్దం పగలగొట్టడంతో కారులో ఉన్న పాయల్‌ శరీరంపై.. కారు మొత్తం గాజు ముక్కలు నిండిపోయాయి.

భయాందోళనతో వెంటనే ఫోన్‌ చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకున్నట్లు పాయల్‌ ముఖర్జీ తెలిపింది. పోలీసులు రావడంతో దుండగులు పారిపోయినట్లు చెప్పింది. అయితే ఈ సంఘటన కలకత్తాలోని సౌత్‌ అవెన్యూ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒకవైపు డాక్టర్‌ అత్యాచారంపై నిరసనలు జరుగుతున్నా కొంచెం కూడా ఎవరికీ భయం లేదా అని తన లైవ్‌లో పాయల్‌ ప్రశ్నించారు. కలకత్తాలో రోజురోజుకు పరిస్థితి దయనీయంగా మారుతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రక్షణ లేదని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనేది ఇంకా తెలియదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News