Allu Arjun vs Pawan Kalyan: మెగా ఫ్యామిలీ అంటే.. చిరంజీవి కుటుంబంతోపాటు అల్లు కుటుంబం కూడా అనే అర్థం.. నిన్న మొన్నటి వరకు ఉండేది. అయితే గత కొద్ది కాలంగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కి మద్దతుగా నంద్యాలకు వెళ్లడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ కోసం వెళ్లకుండా నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్లడం మెగా అభిమానులను బాగా హార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పలు రకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి..
నిన్న జరిగిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం.. మూవీ ఫ్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ మూవీకి నిర్మాణ సారధ్యాన్ని.. పుష్ప దర్శకుడు సుకుమార్.. సతీమణి తబిత వహిస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆయన తన స్పీచ్ లో అన్న కొన్ని మాటలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ మాట్లాడిన కొన్ని మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈవెంట్ లో మాట్లాడిన అల్లు అర్జున్.. సాధారణంగా హీరోని చూసి ఫాన్స్ అవుతారని.. కానీ తాను మాత్రం ఫాన్స్ ని చూసి హీరోని అయ్యానని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా స్నేహితుల కోసం ఎక్కడికైనా వస్తానని.. తనకు ఇష్టమైతే వస్తానని.. లేకపోతే రానని అర్థం వచ్చేలా.. అల్లు అర్జున్ మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ఇన్ డైరెక్ట్ గా నంద్యాలకు వెళ్లిన ఇన్సిడెంట్ గురించి.. అల్లు అర్జున్ ఇప్పుడు రిటార్ట్ ఇచ్చాడు అని అందరూ భావిస్తున్నారు.
దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా బన్నీపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఎంత పెద్ద హీరో అయిన తెరకు పరిచయం అయ్యాకే.. మంచి హిట్లు పడ్డాకే ఫాన్స్ పుట్టుకొస్తారు.. ఎంట్రీ కూడా కాకముందే ఫ్యాన్లు ఎక్కడి నుంచి వస్తారు అని మీమర్స్ బన్నీతో ఆడుకుంటున్నారు. బన్నీ కెరీర్ లో ఎంటర్ కాకముందే అతనికి ఫాన్స్ ఎక్కడ నుంచి వచ్చారు.. గంగోత్రి సినిమాకి అంత భారీ ఓపెనింగ్స్ రావడానికి మెగా అభిమానులే కదా కారణం.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా తన మొదటి షో టికెట్లు మెగా అభిమానులే తీసుకుంటారు అని ఒక ఈవెంట్లో స్పష్టంగా చెప్పారు. తిరిగి వైరల్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. దీంతో సైలెంట్ అవుతోంది అనుకున్న మెగా - అల్లు అభిమానుల సోషల్ మీడియా వార్ తిరిగి షురూ అయింది.
ఫ్రెండ్ అనుకో.. నాకు ఇష్టమయితే నే వస్తా... నా మనసుకు నచ్చితే..
YCP ఫ్రెండ్ issue గురుంచి క్లారిటీ ఇచ్చేసినట్టేనేమో.. #AlluArjun pic.twitter.com/i3Re2tAOcc
— M9 NEWS (@M9News_) August 21, 2024
ఇదీ చదవండి: పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..
ఇదీ చదవండి: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter