Apply Passport Online: మనం దేశంలో ఎక్కడికైనా వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా అవసరం లేదు కానీ, ఏదైనా దేశం వెళ్లాలంటే మాత్రం పాస్‌పోర్ట్ తప్పనిసరి. అంతేకాదు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ మాదిరి పాస్‌పోర్ట్ కూడా కలిగి ఉండాలి. మీకు కూడా ఇప్పటి వరకు పాస్‌పోర్ట్ లేకపోతే ఆన్‌లైన్‌లో సింపుల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
ముందుగా మీకు పాస్‌పోర్ట్ దరఖాస్తు చేయడం తెలిసి ఉండాలి. ప్రభుత్వం పాస్‌పోర్ట్ దరఖాస్తు విధానాన్ని మరింత సులభతరం చేసింది. దీనివల్ల ఏజెంట్లకు మీరు ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మీ వద్ద సరిపడా ధృవపత్రాలు ఉండాలి. ఇప్పుడు మనం పాస్‌పోర్ట్‌కు ఆన్‌లైన్‌లో సులభంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు..
పదో తరగతి మార్కుల పత్రం
ఆధార్ కార్డు
ప్యాన్ కార్డు
ఓటర్ ఐడీ
లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇందులో ఏ ఒక్కటి అయినా చాలు. ఎందుకంటే ఈ పత్రాలపై ఉండే పుట్టిన తేదీ ఆధారంగా తీసుకుంటారు.
అడ్రస్ ప్రూఫ్ కోసం మీ ఇంటి కరెంట్ బిల్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అస్సెస్‌మెంట్ ఆర్డర్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, అనెగ్జర్ ఫార్మాట్1 ఏ క్రిమినల్ కేసు లేదు అని ధృవీరించే ఇండియన్ సిటిజెన్‌షిప్ అఫిడవిట్ కలిగి ఉండాలి.
మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మీకు రూ. 1500-2000 ఖర్చు అవుతుంది. ఒకవేళ మీకు ఇన్స్టెంట్ పాస్‌పోర్ట్ కావాలంటే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.
పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం..
ముందుగా https://portal2.passportindi.gov.in అధికారిక పాస్‌పోర్ట్ సేవ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత న్యూ యూజర్ బాక్స్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
మీ పాస్ట్‌పోర్ట్‌సేవ సిటీ ఆఫీస్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మీ పేరు సరిగ్గా డాక్యుమెంట్లపై ఉన్నవిధంగానే ఎంటర్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
ఆ తర్వాత మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పాస్ట్‌పోర్ట్‌సేవ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
గ్రీన్ లాగిన్ బట్టన్ క్లిక్ చేయాలి
ఆ తర్వాత మీ ఇమెయిల్ ఐడీ నమోదు చేసి కంటిన్యూ నొక్కాలి.
ఇమెయిల్, పాస్వర్డ్, ఇమేజ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
ఇదీ చదవండి:ఈ 8 అందమైన ప్రదేశాలు గోవాలోనే ఉన్నాయంటే మీరు నమ్మరు.. ఇవి చాలామందికి తెలియదు..
ఇప్పుడు ఫ్రెష్ పాస్‌పోర్ట్/ రీఇష్యూ పై క్లిక్ చేయాలి
ఫారమ్ డౌన్‌లోడ్ చేసి వివరాలను నమోదు చేసి మళ్లీ అప్లోడ్ చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లోనే వివరాలను నమోదు చేయవచ్చు రెండు ఆప్షన్లు ఉంటాయి.
మీరు కొత్తదా, రీఇష్యూ కావాలా అక్కడ సెలక్ట్ చేయాలి పర్సనల్ వివరాలు నమోదు చేయాలి. చివరగా సబ్మిట్ బట్టన్ నొక్కాలి
ఆ తర్వాత వెబ్‌పే్ నంబర్ 9 వెళ్లాలి అక్కడ వ్యూ సేవ్ లేదా సబ్మిటెడ్ అప్లికేషన్స్ కనిపిస్తాయి.
మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నట్లు కనిపిస్తుంది. రేడియో బట్టన్ నెక్ట్స్ పై క్లిక్ చేసి పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ పై క్లిక చేయాలి.
ఇదీ చదవండి:నోరూరించే మటన్ కట్లెట్ సింపుల్ గా తయారు చేసుకోండి ఇలా..
ఆన్‌లైన్ పే సెలక్ట్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. అక్కడ మీ పాస్‌పోర్ట్ సేవ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కన్ఫమేషన్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook