Turmeric Side Effects: పసుపు అధిక వినియోగిస్తే చెవిటి వారవుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..

Turmeric Side Effects: చాలామంది శరీరానికి పసుపు మంచిదని అతిగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వినియోగించడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెపోటుతో పాటు ఇతర సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 25, 2024, 04:17 PM IST
Turmeric Side Effects: పసుపు అధిక వినియోగిస్తే చెవిటి వారవుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..

Turmeric Side Effects Too Much: పసుపును ఆయుర్వేద శాస్త్రంలో మౌలికగా భావిస్తారు. అందుకే దీనిని వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా వినియోగిస్తారు. నిజానికి పసుపును ఆహారంలో వినియోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది పసుపు శరీరానికి ఎంతో మంచిదని అతిగా వినియోగిస్తూ ఉంటారు. తక్కువ ఆహార పదార్థాల్లోనే మోతాదుకు మించి వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వాడడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ పసుపును అతిగా వినియోగించడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపును అతిగా వినియోగించడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు: 

పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం లేదా అతిసారం వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మోతాదుకు మించి పసుపును వినియోగించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

చర్మం: 
పసుపు చర్మానికి మంచిది అయినప్పటికీ, అధికంగా తీసుకోవడం లేదా పసుపు తీసుకున్న తర్వాత కూడా తగినంతగా నీరు తాగకపోవడం వల్ల చర్మం పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. అలాగే కొంతమంది అలర్జీకి కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు పసుపును వినియోగించడం మానుకోండి.

రక్తం గడ్డకట్టడం:
 పసుపు రక్తం గడ్డకట్టే ప్రక్రియను మందగించే గుణం ఉంటుంది. అందువల్ల, శస్త్రచికిత్స చేయించుకోబోయే వారు లేదా రక్తం గడ్డకట్టి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు పసుపును అధికంగా తీసుకోవడం మంచిది కాదు. పసుపును తగిన మోతాదులో వినియోగించడమే శ్రేయస్కరం..

గర్భధారణ సమయంలో: 
గర్భవతులు పసుపును అధికంగా తీసుకోవడం వల్ల గర్భస్రావం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పసుపును అతిగా తీసుకునే క్రమంలో తప్పకుండా వైద్యుల సూచనల మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చెవిటి సమస్యలు: 
ఇటీవల కొన్ని అధ్యయనాలు తెలిపిన వివరాల ప్రకారం పసుపును అధికంగా వినియోగించడం వల్ల చెవిటి సమస్యలు కూడా వస్తున్నాయట.. ఇప్పటికే చెవులు వినపడకపోవడం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు పసుపును వినియోగించడం మానుకోండి. 

హృదయ సంబంధ సమస్యలు: 
పసుపులో రక్తం గడ్డకట్టే ప్రక్రియను మందగించే గుణం ఉంటుంది. దీనికి కారణంగా సులభంగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే గుండెపోటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పసుపును తినడం మానుకుంటే ఎంతో మంచిది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News