Radhika Sarathkumar on Hema Committee Report: మలయాళం ఇండస్ట్రీలో మొదలైన హేమా కమిటీ రిపోర్ట్.. ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఎంతోమంది నటులు బయటకి వచ్చి మరి తమపై జరిగిన లైంగిక వేధింపులు బయటపెడుతున్నారు. ఇక ఇదే విషయంపై సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సైతం స్పందించారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈమె బయట పెట్టడం గమనార్హం.
మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై.. హేమ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ మధ్యనే కేరళ గవర్నమెంట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నో నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీస్ ఈ కమిటీ రిపోర్టుపై స్పందిస్తూ భగ్గమంటున్నారు. ఇప్పటికే దీనిపై హీరోయిన్ సమంతతో పాటు సీనియర్ హీరోయిన్స్ కుష్బూలాంటి వారు కూడా స్పందించారు. ఇక ఇదే విషయంపై తాజాగా రాధిక మాట్లాడుతూ..’మలయాళం ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఈ లైంగిక వేధింపులు ఉంటాయి అని బయట పెట్టారు.
మహిళలు పనిచేసే అన్నిచోట్ల ఇలాంటివి ఉన్నాయని కానీ.. సినీ పరిశ్రమలో ఇవి మరి ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో ఎలా ఉందంటే.. హీరోయిన్స్ క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ప్రైవేటు వీడియో చిత్రీకరించి సందర్భాలు తాను ఎన్నో చూశానంటూ సంచలన కామెంట్స్ చేశారు.
"46 సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. ఎన్నో చోట్లా అమ్మాయిలు వేధింపులు ఎదురవుతున్నాయనేది నా అభిప్రాయం. ఇవి సినిమా ఇండస్ట్రీలో మరింత ఎక్కువ. ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. నేను గతంలో నటించినా
ఒక మలయాళీ సినిమా సెట్లో జరిగిన ఓ సంఘటనను నేను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా. నేను ఒక రోజు నా షాట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు.. అక్కడే కొందరు బాయ్స్ గుంపు కూర్చోని ఫోన్‌లో ఎదో చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు. నేను మా సినిమా యూనిట్ కి సంబంధించిన ఓ వ్యక్తిని పిలిచి అక్కడ ఏం జరుగుతుందని అడిగాను. దానికి అతడు చెప్పింది విని నేను ఆశ్చర్యానికి గురయ్యాను. క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడ అమ్మాయిల ప్రైవేటు వీడియో చిత్రీకరించిన వాటిని ఫోన్‌లో చూసి నవ్వుకుంటున్నారని చెప్పారు. నాకు ఆ విషయం వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే మూవీ యూనిట్ కి కంప్లైంట్ చేశాను. మరోసారి క్యారవాన్ లో సీసీ కెమెరాలు పెడితే బాగుండదని, అలానే వారికి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి అని వార్నింగ్ ఇచ్చాను. కానీ ఎందుకో తెలియదు కానీ ఆ విషయం విన్న తర్వాత నుంచి నాకు క్యారవాన్‌కు వెళ్లాలన్నా, దానికి ఉపయోగించాలంటనే భయం వేసింది. మామూలుగా హీరోయిన్స్ కి షూటింగ్స్ కి బయటకు వెళ్ళినప్పుడు.. బట్టలు మార్చుకోవాలన్నా, విశ్రాంతి తీసుకోవడానికి, ఏమన్నా తినాలన్నా అదే మా ప్రైవేట్ ప్లేస్. దానిలోనూ ఇలా సీసీ కెమెరాలు పెట్టి సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.
ఇక ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అయి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.