Gold Rate Today: పండగపూట షాకిచ్చిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్

Gold Price Today: వినాయకచవితి పండగ పూట బంగారం ధరలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి. శనివారం ఏకంగా 600 రూపాయలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 

1 /5

Today Gold And Silver Rates: బంగారం ధరలు భారీగా పెరిగాయి. శనివారం ధర ఏకంగా 600 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ప్రియులు నిరాశతో నిట్టూర్చుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచి కూడా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు వారాంతంలో మాత్రం ఒక్కసారిగా పెరిగాయి.  ప్రస్తుతం బంగారం ధరలను చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర 73, 250 రూపాయల వద్ద పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 67,250 వద్ద పలుకుతోంది.  బంగారం ధరలు వరుసగా నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. ఒక దశలో 73000 రూపాయలు దిగువకు బంగారం ధరలు చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ భారీగా పెరగడంతో బంగారం ధర 73 వేల రూపాయల ఎగువకు వరకు చేరింది. 

2 /5

బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడం వెనుక  అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే అమెరికాలో బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక ఔన్సు  బంగారం ధర 2500 డాలర్ల  ఎగువన ట్రేడ్ అవుతోంది. దీంతో బంగారం ధరలు దేశీయంగా కూడా పెరుగుతున్నాయి.  దీనికి తోడు అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీ పతనం నమోదు అవుతోంది.  

3 /5

ఫలితంగా పెట్టుబడిదారులంతా స్టాక్ మార్కెట్ల నుంచి తమ డబ్బును బంగారం మార్కెట్ల వైపు తరలిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం పెద్ద ఎత్తున పెరిగేందుకు కారణంగా నిలుస్తోంది.  బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం  అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా  ఫెడరల్ రిజర్వ్  కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని  వస్తున్న వార్తలు కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి.   

4 /5

ఇక దేశీయంగా గమనించినట్లయితే శ్రావణమాసం ముగిసిపోయింది. మళ్ళీ దసరా దీపావళి ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విపరీతంగా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడి ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటినుంచి బంగారం ధరల అంచనాలు పెరుగుతున్నాయి. ఫలితంగా పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయిని దాటే అవకాశం ఉంది.   

5 /5

గతంలో 75 వేల రూపాయలు ఎగువన బంగారం ఆల్ టైం గరిష్ట స్థాయి రికార్డును నమోదు చేసింది.  మరోసారి ఆ దిశగా వెళ్లే అవకాశం ఉందని బంగారం  మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.  పసిడి ధరలు 80 వేల రూపాయలు దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.