Kolkata doctor murder case: కోల్ కతా ఘటనలో ఇప్పటికికూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. సీఎం మమతా బెనర్జీ మీద ఫైర్ అయ్యారు. అంతేకాకుండా.. ఈసారి వెస్ట్ బెంగాల్ దుర్గాపూజలు ఉండవంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్ లో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు.. దీనిపై సోమవారం(సెప్టెంబర్ 9) న విచారించింది. ఆగస్టు 9 న ఘటన జరిగిన తర్వాత సీబీఐ ఇప్పటి వరకు చేసిన విచారణపై స్టేటస్ రిపోర్టును సబ్మిట్ చేయాలని ఆదేశించింది.
#WATCH | West Bengal | Kolkata's RG Kar Rape and murder incident | Victim’s father breaks down, says, "...We are not satisfied with the role of the CM (Mamata Banerjee) in the case...She did not do any work...The incident which occurred with my daughter, we have been saying this… pic.twitter.com/u65SQrE2Ma
— ANI (@ANI) September 11, 2024
అంతేకాకుండా.. సెప్టెంబర్ 10 న సాయత్రం 5 వరకు విధులకు హజరు కావాలని ఆదేశించింది. అంతేకాకుండా.. జూనియర్ డాక్టర్ లు విధుల్లోకి హజరైన తర్వాత.. వారిపై చర్యలు తీసుకొవద్దని కూడా తెలిపింది. ఒక వేళ ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా.. డాక్టర్ లు విధుల్లో చేరకుంటే.. చర్యలు తీసుకొవచ్చని కూడా తెలిపింది. ఈ క్రమంలో మమత ప్రభుత్వం.. జూనియర్ డాక్టర్ ల నిరసనల వల్ల.. 23 మంది పెషెంట్లు చనిపోయారని కూడా నివేదిక ఇచ్చింది.
ఈ క్రమంలో కోల్ కతా లో.. ఇప్పటికి కూడా డాక్టర్ లు.. నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మమతా బెనర్జీ నిరసలను తెలియజేస్తున్న జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. కోల్ కతా ట్రైనీ డాక్టర్ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ.. కోల్ కతాలో దుర్గాపూజలపై ఇటీవల సమావేశం నిర్వహించారు. దీనిపై ట్రైనీ డాక్టర్ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈసారి కోల్ కతాలో ఎవరు కూడా ప్రజలు దుర్గాపూజలు జరుపుకోరంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక వేళ దుర్గాపూజలు చేసిన కూడా.. తమ కూతురు గురించి బాధపడుతు కూడా చేసుకుంటారని అన్నారు.
Read more: Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..
తన కూతురును.. అందరు తమ బిడ్డగా భావించి,సంఘీభావంగా నిరసనలు తెలియజేస్తున్నారంటా బాధపడ్డాడు. సీఎం మమతా బెనర్జీ తమ కూతురు పట్ల వ్యవహరిస్తున్న తీరు అందరిని కలిచివేస్తుందని కూడా ఆయన అన్నారు. మమతా సర్కారు..కేవలం సంజయ్ రాయ్ ను మాత్రమే అరెస్ట్ చేశారని, కానీ దీని వెనుక ఉన్న పెద్ద పెద్ద వాళ్లను.. తప్పిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మమతా ఈసారి దుర్గాపూజల పేరిట.. ఈ ఘటనను డైవర్ట్ చేయాలని కూడా మమతా భావిస్తున్నట్లు కూడా బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.