Palakura Pappu Benefits: పాలకూరలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో తక్కువ క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా పాలకూరను ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ ఆకులతో తయారు చేసిన రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అయితే చాలా మందికి పాలకూర పప్పు రెసిపీ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ రెసిపీని కూడా రోజు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
పాలకూర పప్పు తినడం వల్ల కలిగే లాభాలు:
రక్తహీనత నివారణ:
పాలకూరలో ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఈ పాలకూరతో తయారు చేసిన పప్పును తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇది శరీరంలో రక్తం తయారీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనతను నివారించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
కళ్ల ఆరోగ్యం:
పాలకూరలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తరచుగా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఆహారాల్లో దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే దృష్టిని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.
ఎముకల బలం:
పాలకూరలో కాల్షియం, విటమిన్ K వంటి పోషకాలు లభిస్తాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిచేందుకు సహాయపడుతుంది. ఇవి ఎముకలను బలపరచడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి.
చర్మ ఆరోగ్యం:
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ముడతలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం:
పాలకూర పప్పును తినడం వల్ల శరీరానికి ఫోలేట్, పొటాషియం వంటి మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.