Tirumala Laddu: జగన్ కు బిగ్ షాక్.. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు..

Tirumala laddu controvercy: తిరుమల లడ్డు వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఏకంగా ఆయనపై చర్యలు తీసుకొవాలని కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 20, 2024, 01:32 PM IST
  • కొనసాగుతున్న తిరుమల లడ్డు వివాదం..
  • మాజీ సీఎంకు పై చర్యలు తీసుకొవాలని డిమాండ్..
Tirumala Laddu: జగన్ కు బిగ్ షాక్.. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు..

Animal fat in Tirumala laddu controvercy: తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో కాకుండా.. ప్రపంచదేశాలలో కూడా చాలా వివాదస్పదంగా మారింది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. అదే విధంగా గత సర్కారు పవిత్రమైన తిరుమలను పూర్తిగా అపవిత్రం చేసే విధంగా పనులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. భక్తులు తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు.

తిరుమల లడ్డుకు కొన్నిఏళ్ల చరిత్ర కూడా ఉంది. అలాంటిది తిరుమల లడ్డులో.. పంది కొవ్వు, చేపనూనె.. వంటి ఇతర పదార్ధాలను ఉపయోగించినట్లు కూడా సంచలన విషయం దేశమంతా దుమారంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి తిరుమలలోని లడ్డుగురించి వ్యాఖ్యలు చేయడమే కాకుండ.. ల్యాబ్ రిపోర్ట్ ను సైతం బహిరంగపరిచారు.

దీంతో ఇప్పుడిదీ చాలా వివదాస్పదంగా మారింది. శ్రీవారికి మనదేశంలోనేకాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డులో ఉపయోగించే పదార్థాలలో.. పంది కొవ్వు, చేప నూనె ఉపయోగించారని వార్తలు తెలిసి..చాలా మంది భక్తులు తీవ్ర మనోవేదనకు లోనౌతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ లు సైతం వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా.. దీనిపై వైఎస్సార్సీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. చంద్రబాబు.. లడ్డు వ్యాఖ్యలపై వైసీపీ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం.. వచ్చే బుధవారం పిటిషన్ ను విచారిస్తామని చెప్పింది.  మరోవైపు లడ్డు వివాదంపై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు. 

 హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను భంగం కలిగేలా జగన్ ప్రవర్తించారన్నారు. రాజకీయ నేతలు, హిందు సంఘాలు, పలువురు మేధావులు, శ్రీవారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలో.. న్యాయవాది జిందాల్.. 
 కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది.

ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల  మనోభావాలు దెబ్బతీసే విధంగా.. గత జగన్ మోహన్ రెడ్డి నీచానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.

Read more: Viral video: వామ్మో.. ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. కొండ చిలువను చీల్చి చెండాడిన మొసలి.. వైరల్ గా మారిన వీడియో..

వెంటనే దీనిపై టీటీడీ కూడా స్పందించాలని,  జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. అదే విధంగా.. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News