NIT Patna incident: తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేసింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఇలా ఉన్నట్టుండి.. ఫ్యాన్ కి ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించిన వైనం హృదయ విదారకంగా మారింది. బీహార్ పాట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి ) లో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని తన హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ తోటి విద్యార్థినులకు కనిపించింది. ఇక ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాసిగా గుర్తించారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ సూసైడ్ నోట్ లభించగా ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
పోలీసులు అందించిన కథనం ప్రకారం.. నిన్న రాత్రి అనగా సెప్టెంబర్ 20 రాత్రి 10:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన గురించి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, ఆ అమ్మాయి మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు అంటూ పోలీసులు వెల్లడించారు. పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియ రాలేదు. ఇకపోతే ఈ విషాద ఘటనపై అడ్మినిస్ట్రేషన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్ఐటి క్యాంపస్ లో ఆ సంస్థ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న యువతి పూర్తి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్.. అనంతపురం జిల్లా .. బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన యువతీగా తెలుస్తోంది. ఉన్నత విద్యను చదవడం కోసం బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయడానికి పాట్నా ఎన్ఐటిలో చేరింది ఈ విద్యార్థి. అయితే రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఇలా బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ కూతురు చాలా ధైర్యశాలని, బాగా చదువుతుందని అలాంటి అమ్మాయి ఇలా సడన్గా.. ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏదో కుట్ర జరిగిందనే కోణంలో అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక అమ్మాయి సూసైడ్ లో ఏం రాసింది అనే విషయాన్ని కాలేజ్ యాజమాన్యం దాచిపెట్టిందని , ఆ పూర్తి వివరాలు బయట పెట్టాలి అని అమ్మాయి తరఫు బంధువులు కోరుతున్నారు. ఇక పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Also Read: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
Also Read: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.