సాహో Vs బహుబలి  : ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్‌లో పైచేయి ఎవరిది ?

ప్రస్తుత సినీ ట్రెండ్ ప్రభాస్ vs ప్రభాస్ అన్నట్లుగా సాగుతోంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే బాహుబలి vs సాహో అన్నట్లుగా సాగుతోంది..మరింత డీటైల్ గా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

Last Updated : Sep 3, 2019, 12:47 AM IST
సాహో Vs బహుబలి  : ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్‌లో పైచేయి ఎవరిది ?

రిలీజ్ కు ముందే ఎంతో హైప్ తెచ్చుకున్న సాహో మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సాహో టాక్ ప్రేక్షకుల చెవిన వినిపించగానే అందరూ బాహుబలితో పోల్చడం మొదలెట్టారు. బహు తరహాలో ఇది భారీ హిట్ కొడుతుందా..లేదా అనే చర్చ నడిచింది. ఇప్పుడు మూవీ రీలీజ్ అయింది. మరి ఇది బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందా లేదా అనే క్వశ్చన్ మాత్రం సగటు ప్రేమక్షుల మదిలో మొదలూతూనే ఉంది.  ఈ నేపథ్యంలో సాహో  కలెక్షన్లను బాహుబలితో పోల్చిన బాలీవుడ్ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ..ఆసక్తికర వివరాలను బయపెట్టాడు.

సాహో కలెక్షన్స్ ఇవే  ..
సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం  ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల విషయానికి వస్తే 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మూవీ రూ.22.35 కోట్లు సాధించగా... 2017లో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా ఏకంగా రూ.128 కోట్లు కొల్లగొట్టింది. ఇక సాహో విషయానికి వస్తే ఓపెనింగ్ వీకెండ్ లో రూ.79.08 కోట్లు వసూలయ్యానట్లు తరణ్ ఆదర్శ్ తన ట్వీట్ లో వివరించారు. సాధారణ మూవీస్ కు అయితే ఇది పెద్ద హిట్టే..సాహోకు మాత్రం యావరేజ్ గానే పరిగణిస్తున్నారు. అయితే మున్ముందు ఇది బహుబలికు బ్రేక్ చేయగల్గుతుందా లేదాని అనే దానిపై మాత్రం ఉత్కంఠత నెలకొంది.

 

నెగిటివ్ వేవ్ ను తక్కుకొని నిలబడ్డ సాహో
సాహో కు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపై మాత్రం ఆ ప్రభావం పడలేదు.  టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మరే ఇతర పెద్ద సినిమాలు లేకపోవడం, ఈ మూవీకి అధిక మొత్తంలో థియోటర్లు దొరడకడం, గతంతో పోల్చితే భారీ మొత్తంలో టికెట్ ధర పెరిగింది. దీంతో నెటిగిట్ వేగ్ ను సైతం తట్టుకొని సాహో కలెక్షన్ల రాబట్టగల్గింది. బాహుబలి సినిమాతో వచ్చిన ప్రభాస్ కు రిప్యూటేషన్ కారణంగా ఇతర ఈక్వేషన్స్ సాహోపై అంతగా ప్రభావం చూపించలేకపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News