Belly Fat Reduce Tips: బెల్లీ ఫ్యాట్ తగ్గించలేకపోతున్నారా, ఈ టిప్స్ పాటించండి చాలు

Belly Fat Reduce Tips: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం, లేదా బెల్లీ ఫ్యాట్ సమస్యలు పెరిగిపోతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఓ కారణమైతే..శారీరక శ్రమ లేకపోవడం మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వీటి నుంచి ఎలా బయటపడాలి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 24, 2024, 07:36 PM IST
Belly Fat Reduce Tips: బెల్లీ ఫ్యాట్ తగ్గించలేకపోతున్నారా, ఈ టిప్స్ పాటించండి చాలు

Belly Fat Reduce Tips: శరీరం బరువు పెరిగే కొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే హెల్తీ ఫుడ్ అనేది చాలా అవసరం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తవచ్చు. ఇక రోజూ కేలరీలు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ అంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. 

బెల్లీ ఫ్యాట్ అనేది నలుగురిలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇది తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గించుకోలేక విఫలమౌతుంటారు. అయితే కొన్ని టిప్స్, రెమిడీస్ పాటిస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణలు. బెల్లీ ఫ్యాట్‌ను చాలా ఈజీగా కరిగించవచ్చు. ఓ మూలన కుర్చీలో కూర్చుని మీ చేతుల్ని తల వెనుక గట్టిగా బిగించండి. రెండు చేతుల వేళ్లను కలిపి బిగించి వీపును స్ట్రైట్‌గా చేయండి. కొద్దిగా వెనక్కు వంగండి. మీ ఛాతీని మోకాళ్లవైపు వంచాలి. వీలైనంత మందుకు వంగాలి. దీని వల్ల కడుపు కండరాలు స్ట్రెచ్ అవుతాయి. ఈ సమయంలో శ్వాస పీల్చడం, వదలడం చేస్తుండాలి. ఇలా 15 సార్లు మూడు విడతల్లో చేయాలి. 

ఇక రెండవది బటర్ ఫ్లై పోజులో ఉండటం. ఇలా చేయడం వల్ల చాలా సులభంగా బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. ముందుగా ఫ్రీగా కూర్చోవాలి. ఇప్పుడు కాళ్లను చాపాలి. మోకాళ్లు మడిచి కాళ్లను పెల్విక్ వైపుకు తీసుకురావాలి. కాలి పాదాల్ని ఒకేసారి నొక్కాలి. చేతుల్ని పట్టుకుని నెమ్మదిగా పైకి లేపాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బరువు తగ్గించాలంటే ఎప్పుడూ వంగుని కూర్చోకూడదు. స్ట్రైట్‌గా కూర్చోవాలి. రోజంతా ఎప్పుడూ ఇలానే కూర్చోవడం అలవాటు చేసుకుంటే మంచిది.

నీళ్లు తాగేటప్పుడు ఎప్పుడూ కూర్చుని తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ, మెటబోలిజం రెండూ వేగవంతమౌతాయి. కడుపు ఫ్యాట్ కరిగించేందుకు తాగే నీరు కీలక పాత్ర పోషిస్తుందగి. ఈ టిప్స్ క్రమం తప్పకుండా ప్రతిరోజూ పాటిస్తే చాలా వేగంగా బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బయటపడవచ్చు. 

Also read: 6 Dangerous Oils: మీరు ఈ 6 నూనెలు వాడుతుంటే వెంటనే ఆపేయండి, లేకపోతే ప్రాణాంతకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News