Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..

Robbery in mohan babu house:  సినినటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. రూ.10 లక్షలతో పనిమనిషి పారిపోయినట్లు కూడా తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 25, 2024, 10:49 AM IST
  • మోహన్ బాబు ఇంట్లో మరో ఘటన..
  • పోలీసులకు ఫిర్యాదు..
Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..

Theft in Actor Manchu mohan babu Residence: సిని నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ చేసుకుంది. జల్ పల్లిలోని మోహన్ బాబునివాసంలో రూ.10 లక్షలతో పని మనిషి ఉడాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని బీరువాలోని వస్తువులు చిందర వందరగా పడివేసి ఉన్నట్లు గుర్తించారు . దీంతో పనిమనిషీ నాయక్ మీద అనుమానం రావడంతో ఆరాతీశారు. కానీ.. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోహన్ బాబు.. నిన్న రాత్రి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. పనిమనిషిని.. తిరుపతి లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా.. గతంలో కూడా మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా పనిమనిషే చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా పనిమనిషి చోరీలకు పాల్పడిన ఘటన మాత్రం.. రచ్చగా  మారింది.  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News