Viral Video: కింగ్ కోబ్రాతో ఫైటింగ్ చేసిన పిట్ బుల్.. వైరల్‌గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదే..

Pitbull attacks on snake: పిల్లలు గార్డెన్ లో ఆడుకుంటున్నారు. అప్పుడు ఒక్కసారిగా పాము రావడంతో అక్కడున్న వారంతా భయంతో దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 25, 2024, 02:56 PM IST
  • పాముపై దాడి చేసిన పిట్ బుల్..
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
Viral Video: కింగ్ కోబ్రాతో ఫైటింగ్ చేసిన పిట్ బుల్.. వైరల్‌గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదే..

Pitbull dog attack on snake: పాములు కన్పిస్తే ఎవరైన దూరంగా పారిపోతుంటారు.  పాముల పేర్లు ఎత్తేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపించారు. కొండలు, అడవులు ఉన్నచోట పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఎలుకల కోసం పాములు మన ఇళ్లలోని వస్తుంటాయి. పొలాలలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పాములు వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు చూసేందుకు నెటిజన్ లు సైతం భయపడిపోతుంటారు.

 

మరికొందరు మాత్రం పాములు వీడియోలను ఆసక్తితో చూస్తుంటారు.. అందుకే పాముల వీడియోలకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోవింద్ ఉందని కూడా  చెప్పుకొవచ్చు. పాములకు అపకారం చేస్తే కాలసర్పదోషం వస్తుందని చెబుతుంటారు. పాములకు చంపేవారి జీవితంలో చాలా రకాల ఇబ్బందులు కూడా వస్తాయని చెబుతుంటారు. ఈ క్రమంలో పాములకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

కొంత మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. అవి తమ యజమాని పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాయి. అంతేకాకుండా.. కొత్త వాళ్లు లేదా కొత్త జంతువు ఇంటి ఆవరణలో వస్తే అరుస్తూ ఓనర్ ను అలర్ట్ చేస్తాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మంగళవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివగణేష్ నగరంలోని ఓ ఇంట్లోని గార్డెన్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. మరీ అక్కడ ఒక కింగ్ కోబ్రా ఒక్కసారిగా వచ్చింది. పామును చూడగానే.. అక్కడున్న వారంతా గట్టిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అక్కడ వాళ్లు పెంచుకుంటున్న పిట్ బుల్ కుక్క పరుగున వచ్చింది. అది పాముపై దాడికి దిగింది.

Read more: Viral Video: ఛీ..ఛీ ఎంత ఘోరం.. పట్టపగలే బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. వీడియో వైరల్..

పామును నోటితో చీల్చి చెండాంది. దీంతో చివరకు  పాము చనిపోయింది. ఈ వీడియో అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇదిలా ఉండగా.. పిట్ బుల్ కుక్కలు ఇప్పటి వరకు ఎంతో మందిని పొట్టన బెట్టుకున్నాయి. వీటిని పెంచుకున్నయజమానుల్ని సైతం కొన్నిసార్లు కరిచి గాయపర్చిన ఘటనలు ఉన్నాయి. తాజా ఘటనలో మాత్రం..ఈ పిట్ బుల్ కుక్క హీరోలాగా మారింది. ఇప్పటివరకు జెన్నీ దాదాపు 8 నుంచి 10 పాములను చంపినట్లు దాని యజమాని వెల్లడించాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News