Biscuits Side Effects: పిల్లలకు ఉదయాన్నే బిస్కెట్లు తినిపిస్తున్నారా? అయితే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Side Effects of Biscuits: మన ఇళ్లలో చాలా మంది ఉదయాన్నే పిల్లలకు చాయ్ బిస్కెట్, పాలు బిస్కెట్ తినిపిస్తుంటారు. మీరు కూడా బిస్కెట్స్ తినిపిస్తున్నట్లయితే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువగా బిస్కెట్లు తినిపించడం వల్ల పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. పూర్తి వివరాలు చూద్దాం.   

Written by - Bhoomi | Last Updated : Sep 25, 2024, 10:00 PM IST
Biscuits Side Effects: పిల్లలకు ఉదయాన్నే బిస్కెట్లు తినిపిస్తున్నారా? అయితే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Side Effects of Biscuits in Children: చాలా మంది పిల్లలు ఏడ్చినప్పుడు, లేదా ఆకలిగా అనిపించినప్పుడు పేరేంట్స్ బిస్కెట్లు ఇస్తుంటారు. పిల్లలు కూడా బిస్కెట్స్ ఇష్టంగా తింటుంటారు. చాలా మంది తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత బిస్కెట్లు తినిపిస్తుంటారు. అదే సమయంలో, ప్రజలు సుదీర్ఘ ప్రయాణానికి వెళ్లినప్పుడు, వారు తమతోపాటు బిస్కెట్లు తీసుకుంటారు. మన పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు తినిపించేదే కాదా అనుకుంటే పొరపాటు పడినట్లే. కానీ పిల్లలకు బిస్కెట్లు ఇస్తే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. బిస్కెట్లు ఎక్కువగా తింటే పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

బిస్కెట్లు సాధారణంగా పిండి, హానికరమైన కొవ్వులు, అధిక సోడియం, షుగర్, క్రుత్రిమ స్వీటెనర్లను ఉపయోగించి తయారు చేస్తుంటారు. ఈ పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల పిల్లల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. దీంతో వారు బరువు పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. దీంతోపాటు బిస్కెట్లు ఎక్కువగా తినే పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

2018లో జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం..బిస్కెట్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయని..ఇది పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. అంతేకాదు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ కు కూడా కారణం అవుతుందని తెలిపింది. 

Also Read: EPF: ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఇకపై కంపెనీ అనుమతి లేకుండానే పీఎఫ్ విత్ డ్రా చేసుకునే చాన్స్

మలబద్ధకం: బిస్కెట్ల తయారీలో ఉపయోగించే పిండి రోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.  గోధుమ పిండిని ప్రాసెస్ చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం అవుతాయి. ప్రాసెస్ చేసిన తెల్ల పిండి ఆరోగ్యానికి చాలా ప్రమాదకం. వీటితో తయారు చేసిన బిస్కెట్లను పిల్లలకు తినిపిస్తే వారి జీర్ణక్రియ మందగిస్తుంది. ప్రాసెస్ చేసిన పిండి తినడం వల్ల పిల్లల ప్రేగుల పనితీరు మందగిస్తుంది. ఎక్కువ బిస్కెట్లు తినిపించడం వల్ల పిల్లలలో మలబద్ధకం వస్తుందని చెబుతున్నారు. 

జీర్ణక్రియ,దంత సమస్యలు: బిస్కెట్లను సాధారణంగా ప్రాసెస్ చేసిన పిండి, కృత్రిమ రుచులు, సోడియం, కొవ్వు, రంగులతో తయారు చేస్తారు. ఇలాంటి ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని తింటే చిన్నారులు జీర్ణకోశ సమస్యలతో పాటు కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలకు గురవుతారని తెలిపారు. బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల దంత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. బిస్కెట్ల అలవాటు వల్ల పిల్లల ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతాయి. అంతే కాకుండా బిస్కెట్లు తినడం వల్ల పిల్లల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. 

Also Read: Biggest IPO: మార్కెట్లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్న బాహుబలి ఐపీవో.. ఎల్ఐసీ రికార్డు గోవిందా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News