Devara Review: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్..

Devara Part -1: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర పార్ట్ -1’. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు..

1 /10

‘దేవర’ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న 30వ చిత్రం. మరియు నటుడిగా థియేట్రికల్ గా విడుదల అవుతున్న 32వ మూవీ. చిన్నపుడు ‘రామాయణం’  సినిమాలో ఎన్టీఆర్ బాల  రాముడిగా నటించాడు. అటు వెంకటేష్ హీరోగా నటించిన ‘చింతకాయల రవి’ మూవీలో అతిథి పాత్రలో మెరిసాడు.

2 /10

ఎన్టీఆర్ కెరీర్ లో రెండు పార్టులుగా విడుదల కాబోతున్న మొదటి చిత్రం ‘దేవర’. అందులో ఫస్ట్ పార్ట్ మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాతఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ‘దేవర పార్ట్ -1’

3 /10

ఎన్టీఆర్ ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నటించిన ఐదో చిత్రం ‘దేవర’. గతంలో ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి, జై లవకుశ సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ లో కనిపించారు.

4 /10

ఆంధ్రావాలా, శక్తి సినిమాల్లో తండ్రీ తనయుల పాత్రల్లో కనిపించిన ఎన్టీఆర్.. ‘దేవర’ లో కూడా మరోసారి తండ్రి కొడుకులుగా ‘దేవర’, వరద’గా తారక్ కనిపించనున్నాడు.

5 /10

అదుర్స్ లో కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేస్తే... ‘జైలవకుశ’లో ముగ్గురు కవల సోదరులుగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. 

6 /10

ఈ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్ సినిమాకు తొలిసారి అనిరుథ్ సంగీతం అందించారు. తొలిసారి ఎన్టీఆర్ తో జాన్వీ, శృతి మరాఠే, సైఫ్ అలీ  ఖాన్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

7 /10

 ఇందులో ‘చుట్టమల్లే’ సాంగ్ ను సెన్సెషన్ క్రియేట్  చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సొంతంగా చేసుకున్న సాంగ్ గా రికార్డులకు ఎక్కింది.

8 /10

ఇక విదేశాల్లో ప్రీ సేల్స్ లో ఫాస్ట్ గా మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన సినిమాగా ‘దేవర’ రికార్డులకు ఎక్కింది. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో ఈ రికార్డు సాధించిన ఫస్ట్ మూవీగా ‘దేవర’ నిలిచింది.

9 /10

లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ‘దేవర’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అక్కడ థియేటర్స్ లో ప్రదర్శితం కాబోతున్న ఫస్ట్ భారతీయ సినిమాగా ‘దేవర’ రికార్డు క్రియేట్ చేసింది.

10 /10

మరోవైపు విదేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించబోతున్న తొలి భారతీయ మూవీగా ‘దేవర’ పేరిట నమోదు అయింది.