CGHS Cardholders: పండగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించేలా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) కార్డుల విషయంలో ఉద్యోగులకు సంబంధించిన కీలక నిబంధనలను మార్చి సడలింపులు ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల అత్యవసర సేవలను పొందే నియమాలను సీజీహెచ్‌ఎస్ కార్డుదారులకు మునుపటి కంటే సులభంగా మార్చింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే చికిత్స పొందవచ్చు.
Also Read: Sahara Refund: సహారా డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఎక్కువ రిఫండ్ పొందవచ్చు
సీజీహెచ్‌ఎస్ కార్డుదారులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలతో ఆరోగ్య సేవలను మరింత సులువుగా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ప్రభుత్వ, ప్రభుత్వ లిస్టెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలను అత్యంత సులభంగా పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈనెల 24వ తేదీన ఆఫీస్ మెమోరాండం (ఓఎం) జారీ చేసింది. ఆస్పత్రుల్లో కన్సల్టేషన్, రోగ నిర్ధారణ, చికిత్స కోసం మెరుగైన సేవలు పొందేందుకు ఈ మార్గదర్శకాలు దోహదం చేయనున్నాయి. రిఫరల్‌కు సంబంధించి పాత నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ)ని కూడా ఉత్తర్వులు జారీ చేసింది.
అత్యవసర సేవల సీజీహెచ్‌ఎస్ నిబంధనలు
- ఆరోగ్య సంస్థలు (హెచ్‌సీఓస్) అత్యవసర పరిస్థితుల్లో సీజీహెచ్‌ఎస్ నుంచి రిఫరల్ లేదా ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. డబ్బు లేకుండా నేరుగా చికిత్స చేయవచ్చు. రోగి చికిత్స పొందుతున్న ఆస్పత్రి నిపుణుల నుంచి అత్యవసర చికిత్స పత్రం పొందాలి. ఈ పత్రంతో ఆస్పత్రి బీసీఏ పోర్టల్‌లో చికిత్స కోసం పిటిషన్ అప్‌లోడ్ చేస్తుంది.
- అత్యవసర చికిత్స కోసం పరీక్ష లేదా చికిత్స సీజీహెచ్‌ఎస్ జాబితాలో చేర్చబడనప్పటికీ రిఫరల్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఆస్పత్రి ఎన్‌హెచ్‌ఏ పోర్టల్ ద్వారా అనుమతి పొందవచ్చు. స్థానిక సీజీహెచ్‌ఎస్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి.
రిఫరల్ నిబంధనల్లో మార్పు
- సీజీహెచ్‌ఎస్ నుంచి స్వీకరించిన కౌన్సిలింగ్ నోట్స్ మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతాయి. సీజీహెచ్‌ఎస్ మెడికల్ ఆఫీసర్ రోగిని వైద్య నిపుణుడికి సూచిస్తే అతడిని 3 నెలల్లో గరిష్టంగా ఆరు సార్లు సంప్రదించవచ్చు.
- ప్రాథమిక సూచనల మేరకు రోగి ఇద్దరు అదనపు నిపుణుల నుంచి సలహా పొందవచ్చు. అయితే సీజీహెచ్‌ఎస్ మెడికల్ అధికారులు ఇచ్చిన సిఫారసులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి వచ్చే రిఫరల్‌కు ఈ నిబంధనలు వర్తించవనే విషయాన్ని గ్రహించాలి.
వృద్ధ లబ్ధిదారులకు మినహాయింపు
వృద్ధులకు మరింత మినహాయింపులు ఇచ్చారు. 70 ఏళ్లు లేదా అంతకన్న ఎక్కువ వయసు కలిగిన లబ్ధిదారులకు నిపుణుడిని సంప్రదించేందుకు ఎలాంటి రిఫరల్ అవసరం లేదు. లబ్ధిదారలు జాబితా చేయబడిన ఆస్పత్రుల్లో బుక్ చేసిన అన్ని వ్యాధి పరీక్షలు, విధానాలకు నేరుగా చికిత్స పొందేందుకు అనుమతి ఉంది. అయితే సీజీహెచ్‌ఎస్‌లో లిస్టెడ్ కానీ పరీక్షలు, చికిత్స కోసం తప్పనిసరిగా సీజీహెచ్‌ఎస్ అధికారుల నుంచి ఆమోదం పొందాలని గుర్తంచుకోవాలి.
ప్రాథమిక రిఫరల్ ఆధారంగా ఎలాంటి సమయం లిమిట్ లేకుండా కౌన్సిలింగ్, టెస్టులు పొందాడని కొన్ని వ్యాధులకు అనుమతించారు. ఆ వ్యాధులు ఇవే..
- పోస్ట్ కార్డియాక్ రోగులు
- అవయవ మార్పిడి రోగులు
- న్యూరో సర్జరీ రోగులు
- మూత్రపిండ (కిడ్నీ) చివరి దశ రోగులు
- క్యాన్సర్ చికిత్స
- ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్
- నరాల సంబంధిత వ్యాధులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.